Ayesha Gilani : పాక్‌లో దారుణం.. టిక్‌టాక్ స్టార్ ఆయేషా గిలానీ హత్య! ఫోన్ చేసింది ఎవరు? హత్య చేసిందీ వారేనా?
Pakistan TikTok Star Ayesha Gilani : పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ టిక్‌టాక్ స్టార్ ఆయేషా గిలాని (28) దారుణ హత్యకు గురయ్యారు. 1
ayesha gilani
Pakistan TikTok Star Ayesha Gilani : పాకిస్తాన్లో ఏం జరుగుతుంది..? పీఓకేలో నరమేధానికి పాల్పడుతున్న పాక్ ప్రభుత్వం.. సొంత పౌరులనుకూడా గాలి వదిలేసిందా? సెలబ్రిటీలు, ఇన్ఫ్లయెన్సర్ల ప్రాణాలు గాలిలో దీపాలేనా? ఈ ప్రశ్నలు ఎందుకంటే అయిషా గిలాని అనే ఓ టిక్‌టాక్ స్టార్ పట్టపగలే దారుణ హత్యకు గురైంది. హంతకులు ఆమెని హత్యచేసిన తర్వాత దర్జాగా బైక్ పై పారిపోయారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపగా సోషల్ మీడియాలో ఆయిషా గిలాని ఫాలోయర్స్‌ని విషాదంలో ముంచెత్తింది.
Also Read : Vehicle Scrapping Policy : మీ ఇంట్లో 15ఏళ్ల పాత వాహనం ఉందా? స్క్రాప్ చేస్తే నగదు, ట్యాక్స్‌లో భారీ ప్రయోజనం!
పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ టిక్‌టాక్ స్టార్ 28ఏళ్ల ఆయేషా గిలాని దారుణ హత్యకు గురయ్యారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో 13లక్షల మంది ఫాలోవర్లతో ఆన్లైన్లో ఎంతో చురుగ్గా ఉండే ఆమె.. పట్టపగలు కారులో ప్రయాణిస్తూ ఉండగా దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విధారక సంఘటన పాకిస్తాన్‌తోపాటు సోషల్ మీడియా వినియోగదారులందరిని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ హత్య దృశ్యాలు క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్యకి కారణాలు ఏంటి అనేది వెంటనే నిర్ధారించలేదు కానీ.. ఆయేషా గిలాని హత్యకి గురి కావడానికి ముందు ఓ ఫోన్ కాల్ వచ్చిందట. ఇంట్లో నుంచి బయటకు రావాలని ఆ ఫోన్ కాల్లో అవతలి వ్యక్తి చెప్పాడట. దాంతో తన 15 ఏళ్ల సోదరి అసీమ, సోదరుడు ఇమతుల్లాతో కలిసి అయేషా గిలాని కారులో బయలుదేరింది. ఆ తర్వాత కొద్ది సేపటికే 30నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా వారి కారును అడ్డుకొని కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ బుల్లెట్ నేరుగా అయేషా గిలాని మెడలోకి దూసుకు వెళ్ళడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
అయేషా గిలాని సోదరుడు ఇమాతుల్లా వెల్లడించిన వివరాల ప్రకారం.. దాడి చేసిన వారి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. దుండగులు అకస్మాతుగా కారుపై దాడి చేయగా ఒక బుల్లెట్ నేరుగా ఆయేషా మెడలోకి దూసుకెళ్లి ఆమె కారులోనే మరణించింది. కారు అదుపు తప్పి మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయేషా 15 ఏళ్ల సోదరి ఆసిమా కూడా తీవ్రంగా గాయపడగా ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఆయేషా గిలాని హత్య వెనుక ఆర్థిక వివాదమే కారణం కావచ్చుఅనేది ప్రాథమిక సమాచారం.
కొంతమంది వ్యక్తులకు ఆయేషా డబ్బు ఇవ్వగా తిరిగి ఇవ్వాలని కోరినందుకే వారు ఇలాచేసి ఉంటారనే అనుమానాన్ని ఆమె తండ్రి వ్యక్తం చేశాడు. తమకి దొరికిన సిసీ ఫుటేజీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పాక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
