సాధారణంగా రెస్టారెంట్ యజమానులు తమ సొంత రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేయడం ద్వారా డబ్బు సంపాదించరు. కానీ ఈ పిజ్జా రెస్టారెంట్ యజమాని తెలివిని కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే.. తన పిజ్జాలను తానే ఆర్డర్ చేయడం ద్వారా వందల డాలర్లు సంపాదించాడు. తన పిజ్జాలను అమ్మిన రెస్టారెంట్ నుంచి DoorDash ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా తానే కొనుగోలు చేశాడు.
అలా ఆఫర్ ద్వారా 24 డాలర్ల ఖరీదైన పిజ్జాలను 16 డాలర్లకే కొనుగోలు చేసి సొమ్ము చేసుకున్నాడు. పిజ్జా ఆర్డర్లపై 75 డాలర్ల చొప్పున సంపాదించాడు. అంతటితో ఆగలేదు. ఇలా పలు సార్లు ఆర్డర్ చేసి అమ్మిన ధర కంటే తక్కువ ధరకే పిజ్జాలను పొందాడు. ఫైనాన్షియల్ సర్వీసెస్ డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ రంజన్ రాయ్ మార్జిన్స్ అనే రెస్టారెంట్ యజమాని ఈ లొసుగును గుర్తించాడు.
రెస్టారెంట్లలో ఆర్డర్ చేసిన పిజ్జాలను ఫుడ్ డెలివరీ DoreDash యాప్ ద్వారా తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయొచ్చో ప్రయోగత్మకంగా చేసి చూపించాడు. రెస్టారెంట్లో ఒక్కో పిజ్జా ధర 24 డాలర్లు కాగా.. DoreDash ఫుడ్ యాప్ ఆఫర్ ద్వారా 16 డాలర్లకే కస్టమర్లు పిజ్జా కొనుక్కోవచ్చు. ఇలా తాను అమ్మిన పిజ్జాను తక్కువ ధరకే తానే కొనుక్కోన్నాడు. తొలుత రాయ్.. తన స్నేహితుడితో కలిసి తన రెస్టారెంట్ నుంచి DoreDash యాప్ ద్వారా 10 పిజ్జాలను ఆర్డర్ చేశాడు.
వీటి ధర 160 డాలర్లు. మరోసారి 10 పిజ్జాలను ఆర్డర్ చేశారు. ఈసారి టాపింగ్స్ లేని పిజ్జాలను కొనుగోలు చేశారు. కొత్త ఖర్చులు తగ్గడంతో పాటు రాయ్ స్నేహితుడు 75 డాలర్ల వరకు సంపాదించాడు. కొన్ని వారాల వ్యవధిలో ఈ ప్రయోగాన్ని చాలాసార్లు ప్రయత్నించి చూశారు. ఇలా వందల డాలర్లు సొమ్ము చేసుకున్నారు. ఎక్కడ తాము పట్టుబడతామనని భయపడ్డారు. కానీ, డోర్ డ్యాష్ యాప్ గుర్తించకపోయే సరికి ఊపిరి పీల్చుకున్నారు.
Read:తెరుచుకున్న రెస్టారెంట్లు..కష్టమర్లకు ట్యూబులే టేబుళ్లు