నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న బుడ్డోళ్ల బిలీవర్ల సాంగ్

పెయిన్.. యూ మేడ్ మీ ఏ, యూ మేడీ మీ ఏ బిలీవర్, బిలీవర్.. సాంగ్ యూత్‌లో ఎంత ఫ్యామసో తెలిసిందే కదా. ఇంటర్నెట్ సెన్సేషనల్ గా మారిన ఈ సాంగ్‌ను స్కూల్ విద్యార్థులు పాడారు. 30సెకన్ల పాటు పెద్ద గ్రూపుగా పాడిన పాట ట్విట్టర్ సంచలనంగా మారింది. 

ఇంగ్లీష్ పాప్ రాక్ బ్యాండ్ పాటను ఉదయం అసెంబ్లీలో పాడారు. వైరల్ గా మారిన ఈ వీడియో ఒరిజినల్ సింగర్ డాన్ రేనాల్డ్స్ కు చేరింది. స్కూల్ విద్యార్థులను ప్రశంసిస్తూ ‘సో బ్యూటిఫుల్. దీన్ని షేర్ చేసినందుకు థాంక్యూ’ అని కామెంట్ చేశాడు. కొందరు నెటిజన్లు బెంగళూరులోని సెయింట్ చార్లెస్ స్కూల్ లో పాడారని అంటుండగా ఏ స్కూల్ లో పాడారనేది నిర్ధారం కాలేదు. 

 

 

ఈ సందర్భంగా నెటిజన్లంతా తమ స్కూల్ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఒరిజినల్ సాంగ్ ను గుర్తు చేస్తూ పాడిన పాట ఫ్యామస్ కావడంతో ఈ వీడియోను లక్షా 14వేల మంది చూశారు. ఆరున్నర వేలకు పైగా లైక్ లు సంపాదించుకుంది.