×
Ad

Shenzhen Skyscraper : ఊగిపోయిన 71 అంతస్తుల భవనం..పరుగో పరుగు

భూకంపం వచ్చిన సమయంలో భవనాలు ఎలా ఊగుతాయి ? అచ్చం అలాగే ఊగిపోయిందో ఓ భవనం. కానీ..భూకంపం రాలేదు..కానీ..ఎందుకు అలా ఊగిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు.

  • Published On : May 19, 2021 / 10:06 AM IST

Chaina

Shaking Building :  భూకంపం వచ్చిన సమయంలో భవనాలు ఎలా ఊగుతాయి ? అచ్చం అలాగే ఊగిపోయిందో ఓ భవనం. కానీ..భూకంపం రాలేదు..కానీ..ఎందుకు అలా ఊగిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు. అందులో ఉన్న ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోనళలకు గురయ్యారు. భవంతి కింద ఉన్న వారు దీనికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది.

చైనా…లో ఆకాశం అందుకొనేలా భవంతులు ఉంటాయి. అందులో షెన్‌జెన్ నగరంలో ఉన్న సెగ్ ప్లాజా ఒకటి. అయితే..అకస్మాత్తుగా అటూ ఇటూ ఊగడం మొదలైంది. సమాచారం తెలుసుకున్న అధికారులు అందున్న వారిని ఖాళీ చేయించారు. భూకంపం వల్లే భవనం కదులుతోందని ప్రజలు భావించారు. కానీ..ఆ ఒక్క భవంతి మాత్రమే ఊగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇక ఈ భవనం విషయానికి వస్తే..దీని ఎత్తు ఎత్తు 356 అడుగులు. 10 అంతస్థుల్లో షెన్‌జెన్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్ ఆఫీసులు ఉన్నాయి. మిగతా అంతస్తుల్లో పలు ఐటీ సంస్థలు ఉన్నాయి. 2000 సంవత్సరంలో ఈ భవనం నిర్మాణం పూర్తిచేసుకుంది. కానీ.ఈ భవనం ఎందుకు ఊగిపోయిందో..తెలియరావడం లేదు.

Read More : Student molested : కూల్ డ్రింక్‌లో మ‌త్తుమందు ఇచ్చి.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం