SG Child Support Package : పిల్లల్ని కంటే రూ.55 లక్షలు.. ఆ ప్రభుత్వం బంపర్ ఆఫర్..

SG Child Support Package : సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల్ని కనే దంపతులకు ఒక్కో బిడ్డకు 17ఏళ్ల వయస్సు వచ్చే వరకు సుమారు రూ.55లక్షలు వివిధ దశల్లో అందజేసేలా కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది.

Singapore Child Support Package

SG Child Support Package : ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు తగ్గిపోతోంది. ఈ క్రమంలో పలు దేశాలు ఎక్కువ మంది పిల్లలను కంటే వారికి భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అంతేకాదు.. పలు దేశాల్లో పిల్లల పోషణ, చదువు ఖర్చులకు కూడా ప్రభుత్వ సహాయం అందించేలా కొత్త స్కీంలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read : AP Govt Scholarship : ఏపీలో డిగ్రీ చదివే అమ్మాయిలకు శుభవార్త.. ఉచితంగా ప్రతీయేటా రూ.30వేలు.. ఐదేళ్ల వరకు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

సింగపూర్‌లో జననాల రేటు క్రమంగా తగ్గుతోంది. దేశంలో సంతానోత్పత్తి రేటు 0.87తో అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే జననాల రేటును పెంచేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు, ప్రసూతి సెలవులు వంటి ఎన్నో ప్రయత్నాలు చేసింది. విశ్వవిద్యాలయ పట్టభద్రులకు మ్యాచ్‌మేకింగ్ ఈవెంట్లు కూడా నిర్వహించింది. అయినా, పరిస్థితి మారలేదు. సంతానోత్పత్తి రేటు పడిపోతూ వస్తోంది. క్రమంగా రికార్డు స్థాయిలో జననాల రేటు పడిపోతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల్నికనే దంపతులు వారిని పెంచే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా ఒక్కో బిడ్డకు 17ఏళ్ల వయస్సు వచ్చే వరకు సుమారు రూ.55లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించేలా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

ప్రభుత్వం ప్రకటించిన మొత్తాన్ని వివిధ దశల్లో అందజేయనుంది. బిడ్డ పుట్టగానే బేబీ గిఫ్ట్ కింద తల్లిదండ్రులకు 10వేల సింగపూర్ డాలర్లు తక్షణ సాయంకింద అందజేస్తారు. ఆ తరువాత బిడ్డకు 17ఏళ్లు నిండే వరకు ఆరోగ్య సంరక్షణ గ్రాంట్లు, సేవింగ్స్ సాయం, వార్షిక చైల్డ్ క్రెడిట్స్, చదువు కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.55లక్షల ఆర్థిక సహాయం లభిస్తుంది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవకుండా సులభతరం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని సింగపూర్ ప్రభుత్వం పేర్కొంది..

ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న కొన్ని కుటుంబ సంక్షేమ పథకాల్లో మొదటి, రెండో, తదుపరి పిల్లల జనన క్రమాన్ని బట్టి ప్రయోజనాలు మారుతున్నాయి. కొత్త విధానంలో మాత్రం ప్రతి చిన్నారికి ఒకే స్థాయిలో ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాలతో 2026 జూన్ నాటికి సుమారు 3.8 లక్షల కుటుంబాల్లోని 6.1 లక్షల మంది పిల్లలు ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.