అద్దంలో చూసుకుంటూ సాలీడు డ్యాన్స్ చూశారా..

అద్దంలో చూసుకుని మురిసిపోయే మనుషులు కాదు.. మూగజీవాలు కూడా స్పందిస్తూ ఉంటాయి. కోతులు.. ఇతర నాలుగు కాళ్ల జంతువులు అద్దంలో తమనే తామే చూసుకుని చేసే ఫీట్లు నవ్వు తెప్పిస్తుంటాయి. వాటన్నిటి కంటే భిన్నంగా ఓ కీటకం.. అందులో సాలీడు వీడియో నవ్వు తెప్పించకమానదు. మీరూ ఓ లుక్కేయండి మరి. 

సాలీడు డ్యాన్స్

 

150అడుగుల ఎత్తులో రింగ్ పొగ
పొగ రింగులు చూడటానికి సరదాగా.. వింతగా అనిపిస్తుంటాయి. సాధారణంగా సిగరెట్ స్మోకర్స్ వదిలే పొగతే వచ్చే రింగ్ పొగలు ఒక అడుగు ఎత్తులో మాత్రమే చూసి ఉంటాం. కానీ, 150అడుగుల ఎత్తులో రింగ్ పొగ చూశారా.. ఇది ఎత్నా పర్వతం మీది సికిలీ ఐలాండ్ లో జరిగింది. వొల్కనే క్రాటర్ నుంచి వచ్చిన పెద్ద పొగ ఇలా మారింది. 

 

ఇట్స్ ఏన్ ఆర్ట్ బ్రో:
మనుషులంటేనే భయపడే పక్షులు.. ఇద్దరు వ్యక్తుల మధ్య దూరి వెళ్లడం మామూలు విషయం కాదు. ఆ ట్రైనింగ్ అలా ఉంది మరి. ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉండగా వారి మధ్యలో నుంచి రెక్కలు ఇముడ్చుకుని నేరుగా ఇటు పక్కకు వచ్చేసింది. 

 

ఇటు నుంచి పాప.. అటుగా బామ్మ
బొమ్మను తలకిందులుగా తిప్పితే వేరొకరి మొహం కనిపించడం చూశాం. కానీ, ఇలా కుడి నుంచి ఎడమకు మనిషి మారడం అరుదుగా కనిపిస్తుంది. ఇదొక అద్భుతమైన కళ అనే చెప్పాలి. అలా ఉందీ పెయింటింగ్. కుడి నుంచి ఎడమకు వెళ్తుంటే బాలిక నుంచి యువతికి.. వృద్ధురాలుగా మారడం స్పష్టంగా కనిపిస్తుంది. డోంట్ మిస్ ఇట్. 

 

30సెకన్లలో మొక్క పెరిగే వీడియో:
నేలలో నాటిన విత్తనం నుంచి మొక్కగా ఎదిగే దశను వీడియో ద్వారా చూస్తే ఏమనిపిస్తుంది. 30సెకన్లలోనే నేలను చీల్చుకుంటూ వస్తున్న మొక్క వీడియో చూసేయండి. 

 

పక్షి మాత్రమే కాదు.. తల్లి కూడా:
ప్రాణం పోతున్నా పిల్లలను కాపాడుకోవాలనుకుంటుంది తల్లి. ఇక్కడ కూడా అదే జరిగింది. పొలంలో పెట్టిన గుడ్లను కాపాడుకునే క్రమంలో ట్రాక్టర్ మీదకు వస్తున్నా తప్పుకోలేదు. రెక్కల బలం అంచనా వేయలేకపోయిందా అంటే అదేం కాదు తాను చేయగలిగింది అది తప్ప వేరేం కాదు. ట్రాక్టర్ బ్లేడ్లు తగులుతాయని కూడా ఏం మాత్రం సడలని ధైర్యంతో తన రెండు గుడ్లను కాపాడుకుంది. మీరూ ఓ లుక్కేయండి ఈ మాతృభక్తిని. 

 

కుర్చీలకు కాళ్లొస్తే:
టెక్నాలజీతో కుర్చీలకు చక్రాలు పెట్టుకుంటున్నారు. కానీ, కుర్చీలకే కాళ్లొస్తే.. ఏముంటుంది చక్రాలు అవసరం లేకుండా ఎటువంటి నేలపైనైనా కుర్చొనే ప్రయాణించొచ్చు. ఇదిగో ఎడారిలో ఓ వ్యక్తి ఇలా కుర్చీలో కూర్చొనే ప్రయాణిస్తున్నాడు. 

 

పరిగెడుతున్న మేఘం:
మిచిగాన్ సరస్సుపై రికార్డు చేసిన ఈ వీడియో 2019 డిసెంబరు 9న రికార్డు చేశారు. మేఘాలు అద్భుతంగా సరస్సుపై పరుగులు పెడుతున్నాయి. చూపు తిప్పుకోకుండా ఉన్న ఈ ప్రత్యేకతను వీక్షించాల్సిందే.