చైనా దేశం అంటే ప్రస్తుతం ఠక్కున గుర్తుకొచ్చేది ‘కరోనా వైరస్, ముఖ్యంగా చైనా దేశంలో ‘ఉహాన్ నగరం’ అంటే మరింతగా భయపడిపోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఉహాన్ లోనే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే..ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘కరోనా వైరస్’బారిని పడకుండా ఓ కుక్క ఓ దేశాన్ని కాపాడింది. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం.
తైవాన్ దేశంలో ఒక మహిళ చైనాలో వైరస్ పుట్టిన వుహాన్ నగరానికి వెళ్లేందుకు రెడీ అయ్యింది. దానికి సంబంధించి బ్యాగ్ కూడా సర్దుకుంది. ఈ క్రమంలో ఆ మహిళ పెంచుకుంటున్న గోల్డెన్ రిట్రీవర్ కిమి అనే కుక్క ఆమె పాస్‌పోర్ట్ చింపి పడేసింది. దీంతో ఉహాన్ నగరానికి వెళ్లే ఆమె ప్రమాదయం కాన్సిల్ అయ్యింది. దీంతో ఆమెకు కోపం వచ్చింది. కాని కిమి అంటే ఆమెకు ప్రాణం ఏమీ చేయలేకపోయింది. కానీ అదే ఆమెను ఆమె దేశాన్ని కాపాడిందని తరువాత తెలుసుకుంది.
ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ..“నా పాస్‌పోర్ట్ చిరిగినట్లు చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కొన్ని రోజుల తరువాత వుహాన్‌లో కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తెలుసుకున్నాను. నా కుక్క నాతో పాటు నా కుటుంబాన్ని.. నాదేశాన్ని కూడా కరోనా వైరస్ బారిన పడకుండా రక్షించింది అని సంతోషంగా తెలిపింది. తరువాత దీనికి తన కుక్క కిమిని చినిగిపోయిన పాస్ పోర్టును తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో దీనికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది.
ఆ కుక్క మీ ఒక్క కుటుంబాన్నే కాదు దేశాన్ని కూడా కాపాడిందని ఆ కుక్కకు మీరు రుణపడి ఉండాలని పలువురు కామెంట్ చేస్తున్నారు. కాగా కరోనా వైరస్ మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.