Dinosaur Warning at UNO: ఐక్యరాజ్య సమితిలోకి డైనోసార్ వార్నింగ్.. ‘ఆలస్యం చేయకండి’

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం బుధవారం కావెర్‌నోస్‌ హాల్‌లో జరిగింది. 193 దేశాల అధినేతలు హాజరై ఒక్కొక్కరు మాట్లాడుతుండగా.. ఇంతలో హాల్‌ తలుపు దగ్గర పెద్ద శబ్దం.

Uno Dinosaur

Dinosaur Warning at UNO: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం బుధవారం కావెర్‌నోస్‌ హాల్‌లో జరిగింది. 193 దేశాల అధినేతలు హాజరై ఒక్కొక్కరు మాట్లాడుతుండగా.. ఇంతలో హాల్‌ తలుపు దగ్గర పెద్ద శబ్దం. ఉలిక్కిపడి చూసిన వారందరికీ పెద్ద షాక్.. ఓ భారీ డైనోసార్‌ నడుచుకుంటూ రావడం కనిపించింది. 7కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్‌ మళ్లీ కనిపించడంతో ఆశ్చర్యపోయారు.

నేరుగా పోడియం దగ్గరకు వెళ్లిన డైనోసార్.. మైక్‌ దగ్గర నిలబడి మానవాళిని ఉద్దేశించి మాట్లాడటం మొదలు పెట్టింది. అప్పటి వరకూ భయంతో, ఆశ్చర్యంలో ఉండిపోయిన దేశాధినేతలంతా వెంటనే హెడ్‌ సెట్‌లను ధరించారు.

‘మానవులారా.. మీరు పర్యావరణ విపత్తు వైపు వెళ్తున్నారు. శిలాజ ఇంధనాలపై సబ్సిడీ కోసం ప్రభుత్వాలు ప్రజా ధనాన్ని ఇంకా ఖర్చు చేస్తూనే ఉన్నాయి. ఏడు కోట్ల సంవత్సరాల్లో విన్న తెలివి తక్కువ విషయం ఇదే. ఇది మీ వినాశనానికి దారితీస్తుంది. ఉల్కల వల్ల మా జాతి అంతరించింది. ఆలస్యం కాకముందే ఇకనైనా మేలుకోండి. మీ వినాశనాన్ని మీరే ఎంచుకోకండి. మార్పును మొదలు పెట్టండి’ అని డైనోసార్‌ పిలుపునిచ్చింది.

………………………………….. : ఏపీ సీఎం జగన్ ని కలిసిన నాగార్జున

దేశాధినేతలంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి డైనోసార్‌ను అభినందించారు. పర్యావరణ మార్పులపై అవగాహన కోస ఐరాస రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ ఇది. ఐరాస చేపట్టిన ‘వినాశనాన్ని ఎంచుకోకండి’ అనే క్యాంపెయిన్‌లో భాగంగా ట్విటర్‌ ద్వారా వీడియోను విడుదల చేశారు.