Viral Video : బంగారం ఛైన్ వేసుకున్నాడు..పారిపోదామని అనుకున్నాడు..కానీ

బంగారం చాలా విలువైంది. అందుకొనే కొంతమంది దొంగలు బంగారు ఆభరణాలను ఎత్తుకెళుతుంటారు. ఛైన్ స్నాచింగ్ లకు పాల్పడుతుంటారు. ఓ దొంగ..బంగారు దుకాణంలోకి వెళ్లి ఓ ఛైన్ ను దొంగతనం చేయాలని అనుకున్నాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొట్టింది. చోరీ చేసి హాయిగా కొన్ని రోజులు బతుకుదామని అనుకున్నాడు. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు.

Thief Tries to Steal Gold Chain : బంగారం చాలా విలువైంది. అందుకొనే కొంతమంది దొంగలు బంగారు ఆభరణాలను ఎత్తుకెళుతుంటారు. ఛైన్ స్నాచింగ్ లకు పాల్పడుతుంటారు. ఓ దొంగ..బంగారు దుకాణంలోకి వెళ్లి ఓ ఛైన్ ను దొంగతనం చేయాలని అనుకున్నాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొట్టింది. చోరీ చేసి హాయిగా కొన్ని రోజులు బతుకుదామని అనుకున్నాడు. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన థాయిలాండ్ లో చోటు చేసుకుంది. ఛోబూరి పట్టణంలో ఓ బంగారు దుకాణంలోకి ఓ వ్యక్తి వచ్చాడు.

ఆ సమయంలో రద్దీ కూడా లేదు. దీంతో ఓ ఛైన్ ను దొంగతనం చేద్దామని అనుకున్నాడు. ఓ ఛైన్ చూపెట్టాలని సూచించాడు. దీంతో దుకాణంలో ఉన్న ఒకతను ఛైన్ తీసి ఇచ్చాడు. మెడలో వేసుకుని..అటూ ఇటూ..నడిచాడు. అమాంతం కాళ్లకు పని చెప్పాడు. డోర్ తీయాలని ప్రయత్నించాడు. కానీ అది తెరుచుకోలేదు. దీంతో ఏమి తెలియనట్టుగా మళ్లీ వచ్చి..అతడికి ఛైన్ ను ఇచ్చేశాడు. వెంటనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించడానికి వచ్చిన వ్యక్తి…సుఫాచాయ్ పాంథాంగ్ గా గుర్తించారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. people who died but are doing well @jamorreram0 ట్విట్టర్ వేదికగా పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది. పలువురు నెటిజన్లు సరదా సరదా కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు