trump:జార్జియా గంటకు పైగా ప్రచారంలో మాట్లాడిన Trump.. బిడెన్‌ను ఎగతాళి చేశారు. శుక్రవారం రాత్రి ట్రంప్ మాట్లాడుతూ.. 2020 ఎన్నికల్లో జోబిడెన్ చేతిలో ఓడిపోవడమా.. అలా అయితే దేశాన్ని విడిచివెళ్లిపోతా అని ఎగతాళిగా అన్నాడు.
‘మీకొకటి తెలుసా.. చెత్త క్యాండిడేట్ కు వ్యతిరేకంగా అమెరికా రాజకీయాల్లో పోటీ చేయమని నాపై ఒత్తిడా.. నేను ఓడిపోవడాన్ని మీరు ఊహించగలరా.. నా జీవితంలో నేనేం చేస్తున్నా. రాజకీయంగా ఇంత చెత్త వ్యక్తిని ఎదుర్కొని ఓడిపోతే అస్సలు కరెక్ట్ గా తీసుకోను. ఒకవేళ దేశాన్ని వదిలి వెళ్లిపోతా కావొచ్చు. నాకే తెలియదు’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం బిడెన్ కు రాష్ట్ర ఎన్నికల్లో డబుల్ డిజిట్స్ వస్తాయని తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ వచ్చేనెల జరిగే ఎన్నికల్లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాకపోతే పలు ప్రోసిక్యూషన్స్ కింద విచారణ ఎదుర్కోవల్సి ఉంటుంది.
ఒబామా ప్రచారం:
డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రంగంలోకి దిగనున్నారు. వచ్చేవారం పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ఒబామా పాల్గనున్నారని బిడెన్ ప్రచార విభాగం తెలిపింది. ఆన్‌లైన్ ప్రచారం చేసేందుకు ఒబామా అంగీకారం తెలుపగా.. ఆయన వ్యక్తిగతంగా ప్రచారం చేయడం ఇదే తొలిసారి.