Russia-Ukraine war : ఐదు రోజులు గడిచినా రష్యా మమ్మల్ని ఏమీ చేయలేక పోయింది : యుక్రెయిన్ రక్షణ మంత్రి

‘‘ఐదు రోజులు..అంటే 85గంటల నుంచి మేం రష్యాతో పోరాడుతున్నాం..! ఐదు రోజులు గడిచినా రష్యా యుక్రెయిన్ మమల్ని ఏం చేయలేకపోతున్నారు..! మా డిఫెన్స్‌ను బ్రేక్‌ చేయడం మీ వల్ల కాదు..!

Ukrainian Defense Minister Oleksi Reznikov Shared A Selfie With President Volodymyr Zhelensky

Russia-Ukraine war : రష్యా సేనలు అత్యాధునిక ఆయుధాలతో యుక్రెయిన్ పై విరుచుకుపడుతున్నా యుక్రెయిన్ మాత్రం ఏమాత్రం తగ్గేదేలేదంటోంది. రష్యాపై పోరాడటంతో దూకుడును గత 85 గంటలుగా ఏమాత్రం తగ్గించకుండా రష్యా సేనలపై విరుచుకుపడుతున్నారు యుక్రెయిన్ సైనికులు. ఇది ఓ చిన్న దేశం అయిన యుక్రెయిన్ కు మానసికంగా చాలా ఉత్సాహాన్నిస్తోంది. రష్యా బలగాలు ..ఆయుధాలతో పోలిస్తే యుక్రెయిన్ చాలా స్వల్పమైంది. యావత్ ప్రపంచం అంతా కూడా అదే అనుకుంది. ఏ దేశం తమకు సహాయం చేయకపోయినా..యుక్రెయిన్ మాత్రం మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా రష్యా సేలను ఎక్కడిక్కడు శక్తికి మించి అడ్డుకుంటోంది. రష్యా చేసిన ప్రతీ దాడిని సమర్ధవంతగా తిప్పికొడుతోంది యుక్యిన్. రెట్టించిన ఉత్సాహంతో రష్యాపై యుక్రెయిన్ పోరాడటాన్ని కొనసాగిస్తోంది గత ఐదు రోజులుగా..

Also read : Operation Ganga: ఆపరేషన్ గంగ వేగవంతం.. భారతీయుల తరలింపునకు మరో పది విమానాలు..
ఈ ఉత్సాహంలో ఉన్న యుక్రెయిన్ అధ్యక్షుడు.. జెలెన్ స్కీతో కలిసి రక్షణ మంత్రి సెల్ఫీ తీసుకుని మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఐదు రోజులు..అంటే 85గంటల నుంచి మేం రష్యాతో పోరాడుతున్నాం..! ఐదు రోజులు గడిచినా రష్యా యుక్రెయిన్ మమల్ని ఏం చేయలేకపోతున్నారు..! మా డిఫెన్స్‌ను బ్రేక్‌ చేయడం మీ వల్ల కాదు..! మా రాజధాని ఎప్పటికీ మీ వశం కాదు..! కానివ్వం..మేము ఇప్పటికే విజయానికి దగ్గరయ్యాం..మీరు ఇప్పటికైనా మీ దేశానికి తిరిగివెళ్లిపోతే మంచిది..! ఇప్పటికీ ఆలస్యం కాలేదు..! గో బ్యాక్‌..!’’అంటూ యుక్రెయిన్‌ డిఫెన్స్‌ మినిస్టర్‌ తాజాగా రష్యాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు..!

అవును..! రష్యాపై విజయం తమదే అంటోంది యుక్రెయిన్‌. ఓవైపు యుక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతుండగా.. యుక్రెయిన్‌ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. రష్యా క్షిపణులపై డ్రోన్‌లతో దాడి చేస్తోంది యుక్రెయిన్ సైన్యం. మరోవైపు యుక్రెయిన్‌ నివాస భవనాలపై రష్యా విరుచుకుపతోంది. చెర్నిహివ్‌లోని ఓ నివాస భవనంపై రష్యా క్షిపణి దాడి చేసింది. దీంతో బిల్డింగ్‌లోని రెండు అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి.

Also read : Russia – Ukraine War: రష్యా చెబుతుందొకటి.. చేసేది మరొకటి

యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌తో పాటు ఖార్కివ్‌ నగరాల్లో మరోసారి పేలుళ్లు సంభవించాయి. ఒకవైపు చర్చలంటూనే భీకర దాడులకు తెగబడుతోంది రష్యా. అయితే రష్యా దాడులను యుక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇక ఇవాళ యుక్రెయిన్‌కు చాలా కీలకమన్నారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. 24 గంటల్లో ఏదైనా జరగొచ్చన్నారు. మరోవైపు పుతిన్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు యూరోపియన్‌ యూనియన్‌ రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. రష్యా విమానాలపై నిషేధం విధించింది. తమ భూభాగంలోకి రష్యా విమానాలు రాకుండా ఈయూ నిషేధం విధించింది. యుక్రెయిన్‌కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆయుధాల కొనుగోళ్ల కోసం యుక్రెయిన్‌కు ఆర్ధిక సాయం చేయాలని కూడా ఈయూ నిర్ణయించుకుంది. యుక్రెయిన్‌కు ఫైటర్‌ జెట్స్‌ పంపలాని నిర్ణయించుకుంది. మరోవైపు రష్యా న్యూక్లియర్‌ దాడులకు సిద్ధపడడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇవాళ పలు దేశాల నేతలతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ సమావేశం కానున్నారు.

మరోవైపు రష్యాకు దీటుగా యుక్రెయిన్‌ విరుచుకుపడుతోంది. 150 రష్యా ట్యాంకర్లను ధ్వంసం చేశామని యుక్రెయిన్‌ ప్రకటించింది. 26 రష్యా చాపర్లను కూల్చివేసినట్లు తెలిపింది. 4 వేల 500 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. అటు రష్యా దాడుల్లో 352 మంది యుక్రెయిన్‌ సైనికులు, పౌరులు మృతి చెందినట్లు సమాచారం. 16వందల 84 మంది గాయపడినట్లు యుక్రెయిన్‌ వెల్లడించింది.

Also read : Movie Tickets Issue: పవన్ తర్వాత ప్రకాష్ రాజ్.. ఇది దేనికి సంకేతం?

యుక్రెయిన్‌లో రెండవ అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లో రెండు దేశాల సేనల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. దక్షిణ యుక్రెయిన్‌లో కీలకమైన ప్రాంతాలన్నిటిని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. విమానాశ్రయాలు మీద దృష్టిపెట్టిన రష్యా సేనలు దాడులు ముమ్మరం చేశాయి. అటు కీవ్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భూగర్భ గ్యారేజీల్లోనూ, సబ్‌వేల్లోనూ బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. అయినా యుక్రెయిన్ సేనలు రష్యా దాడులకు ఏమాత్రం భయపడటంలేదు. సమర్థవంతంగా తిప్పికొడుతోంది. యుక్రెయిన్ సేలనలకు తోడు ఉడతా భక్తిగా మేమున్నాం అంటున్నారు సామాన్య ప్రజలు. రష్యా సైనికులు కనిపిస్తే చాలా యుక్రెయిన్ ప్రజలు దాడులు చేస్తున్నారు.