Usha Vance : మగ బిడ్డకు జన్మనిచ్చిన ఉషా వాన్స్.. పేరేంటో తెలుసా? భారత్తో లింక్ ఉందా..
Usha Vance welcome baby boy : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ మగ బిడ్డకు జన్మనించారు.
Usha Vance welcome baby boy
Usha Vance welcome baby boy : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ ఆదివారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) మగ బిడ్డకు జన్మనిచ్చారు. 2014లో ఉష, జేడీ వాన్స్ కు వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమారులు ఇవాన్, వివేక, కుమార్తె మిరాబెల్ ఉన్నారు. ప్రస్తుతం నాలుగో బిడ్డకు ఉషా వాన్స్ జన్మనించారు.
Also Read : Vande Mataram : వందేమాతరం గేయాన్ని అవమానిస్తే ఇక జైలు.. కేంద్రం కీలక బిల్లు!
జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభవార్తను పంచుకున్నారు. ఉషా మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా పిల్లలు తమ చిన్ని తమ్ముడిని కలుసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు’ జేడీ వాన్స్ పేర్కొన్నారు. బిడ్డకు వైద్యం అందించిన వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
— JD Vance (@JDVance) July 19, 2026
వాన్స్ దంపతులు తమ నాల్గో బిడ్డకు అలెక్ నీల్ వాన్స్ (Alec Neel Vance) అని పేరు పెట్టారు. ఈ పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలెక్ అనేది సాధారణంగా అలెగ్జాండర్ అనే పేరుకు సంక్షిప్త రూపంగా భావిస్తారు. గ్రీకు మూలాలున్న ఈ పేరుకు రక్షకుడు, ప్రజలను కాపాడేవాడు అనే అర్ధాలు ఉన్నాయి. ఇక నీల్ అనే పేరు భారతీయులకు సుపరిచితమైనది. సంస్కృతంలోని నీల అనే పదం నుంచి వచ్చిన ఈ పేరుకు నీలం రంగుం, ఆకాశం, నీలి వర్ణం వంటి అర్ధాలు ఉన్నాయి. భారత్ లో ఈ పేరును ఎంతోమంది ఉపయోగిస్తారు. ఉషా వాన్స్ తెలుగు మూలాలున్న వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ చిన్న కుమారుడి పేరులో ‘నీల్’ అని చేర్చడం ఆసక్తికరంగా మారింది.
