50 Hours Buried : శవపేటికలో యూ ట్యూబర్..సమాధిలో 50 గంటలు..!!
- nagamani
- Published On : April 3, 2021 / 12:19 PM IST
Us Youtuber Spend 50 Hours Buried
US YouTuber Spend 50 Hours Buried : చాలామంది ఫేమస్ కోసం ఫీట్లతో రిస్కులు చేస్తుంటారు. ప్రాణాలను పణ్ణంగా పెట్టి మరీ రిస్కులు చేస్తుంటారు. అటువంటిదే చేశాడు ఓ యూట్యూబర్. అని చేసిన వీడియో చూస్తే చెమటలు పట్టాల్సిందే. అమెరికాకు చెందిన యూ ట్యూబర్ మిస్టర్ బీస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.
అమెరికాకు చెందిన యూ ట్యూబర్ మిస్టర్ బీస్ట్ సమాధి అయిపోయాడు. అదికూడా ఏదో ఒక గంటో రెండు గంటలో కాదు ఏకంగా 50 గంటల పాటు సమాధి అయిపోయాడ. శవపేటికలో పడుకుని గోతిలో సమాధి అయ్యాడు. మిస్టర్ బీస్ట్ పేరుతో ఫేమస్ అయిన జిమ్మీ డోనాల్డ్సన్‌కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో మిస్టర్ బీస్ట్ 50 గంటలపాటు తాను సమాధిలో ఎలా ఉన్నాడో చూపించాడు. అద్దాల శవపేటికలో అమర్చిన కెమెరాలు మిస్టర్ బీస్ట్‌ను వివిధ యాంగిల్స్‌లో రికార్డు చేశాయి. అలా రెండు రోజుల పాటు భూమిలోపల శవ పేటికలో ఉన్న మిస్టర్ బీస్ట్ తన వద్దనున్న డివైజ్ తో తన పరిస్థితి గురించి నిరంతం ఫ్రెండ్స్ తో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ సమాధిలోపల బీస్ట్ ఒక దుప్పటి, కొన్ని ఆహార పదార్థాలు ఏర్పాటు చేసుకున్నాడు. మిస్టర్ బీస్ట్ పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ కోట్లాదిమందికి చూశారు. చూస్తూనే ఉన్నారు.
