child dressed in superman
Chile President Speech: ఒక్కోసారి చిన్న పిల్లలు చేసే అల్లరి పనులు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. వారుచేసే చేష్టలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గానూ మారుతుంటాయి. తాజాగా చిలీ దేశంలో ఓ బుడ్డోడు సూపర్ మ్యాన్ డ్రస్సులో సైకిల్ పై చక్కర్లు కొడుతూ తెగ హడావుడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ బుడ్డోడు సూపర్ మ్యాన్ డ్రస్సులో హీరోలా సైకిల్ పై చక్కర్లు కొట్టింది ఎవరి చుట్టూనో తెలుసా.. చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ చుట్టూ.. సాధారణగా దేశ అధ్యక్షుడు దగ్గరకి వెళ్లాలంటేనే జంకుతారు. అదీ అధికారిక కార్యక్రమంలో ఆయన సీరియస్ అంశంపై ప్రసంగిస్తున్నప్పుడు వెళ్లగలమా? చీమ చిటుక్కుమన్నా భద్రతా సిబ్బంది అలర్ట్ అవుతారు. కానీ సూపర్ మ్యాన్ డ్రస్సులో ఉన్న ఓ బుడ్డోడు మాత్రం ఏం చక్కా అధ్యక్షుడి చుట్టూ సైకిల్ పై చక్కర్లు కొట్టాడు.
Viral Video: మాస్క్ పెట్టుకునే గంగాజలం తాగిన రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్
చిలీ ప్రభుత్వం కొత్త రాజ్యాంగానికి మద్దతు ఇవ్వాలంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. దానిపై తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆ దేశ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ మాట్లాడాడు. ప్రజలంతా సవరణలకు అనుకూలంగా ఓటు వేయాలని కోరారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి సూపర్ మ్యాన్ డ్రస్సులో చిన్న సైకిల్ పై ఓ బుడ్డోడు అధ్యక్షుడి వద్దకు వచ్చాడు. పక్కనే భద్రతా సిబ్బంది, ఇతర అధికార బృందం ఉన్నప్పటికీ ఆ బుడ్డోడిని ఎవరూ అడ్డుకోలేదు. నేరుగా అధ్యక్షుడు గ్రాబియెల్ మాట్లాడుతున్న ప్రదేశం వద్దకు వచ్చి.. చుట్టూ సైకిల్ పై తిరగడం మొదలు పెట్టాడు. అలా రెండు రౌండ్లు వేసిన తరువాత మూడో రౌండ్లో సైకిల్ ఆపి అసలు అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నాడబ్బా.. అన్నట్లుగా ఓ లుక్ వేశాడు.. అలా కొద్దిసేపు చూసిన తరువాత మళ్లీ సైకిల్ తో రౌండ్లు వేయడం వీడియోలో కనిపిస్తోంది.
Superman encircles Gabriel Boric after he submits his vote in today’s plebiscite ?? pic.twitter.com/2Tk63noO62
— David Adler (@davidrkadler) September 4, 2022
చిన్నారి సైకిల్ పై తన చుట్టూ చక్కర్లు కొడుతున్నప్పటికీ అధ్యక్షుడు కానీ, పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది ఎవరూ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుడ్డోడి చిలిపి చేష్టలను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవేస్తున్నారు. ఈ వీడియో ట్విట్టర్‌లో 1.33 లక్షలకు పైగా మంది నెటిజన్లు వీక్షించారు. చాలామంది నెటిజన్లు సరదా కామెంట్లతో రీ ట్వీట్లు చేస్తున్నారు.