Wife Viral Shopping List :ఏ భార్యా ఇంత డీటెయిల్డ్ గా భర్తకు షాపింగ్ లిస్టు ఇచ్చి ఉండదేమో..!

ఓ భార్య తన భర్తకు ఇంట్లోకి సరుకులు, కూరగాయాలు రాసి ఇచ్చిన షాపింగ్ లిస్టు వైరల్ గా మారింది. ఏ భార్య కూడా ఇంత డిటైల్డ్ గా లిస్ట్ రాసి ఇచ్చి ఉండదేమోననిపిస్తుంది ఈ లిస్ట్ చూస్తే..

Wife Viral Shopping List : ‘ ఏవండీ ఇంట్లో కూరగాయలు,సరుకులు అయిపోయాయి..సూపర్ మార్కెట్ కు వెళ్లి పట్టుకురండీ’ అంటూ భార్యలు భర్తల చేతికి ఓ సంచీ ఇస్తారు. అలాగే ఏమేమీ కూరగాయాలు, సరుకులు కావాలో కూడా లిస్టు రాసి ఇస్తారు. కానీ ఓ భార్య మాత్రం తన భర్తకు రాసి ఇచ్చిన షాపింగ్ లిస్టు చూస్తే నోరెళ్లబెడతాం. ‘‘ఏంటీ అంత భారీగా లిస్టు రాసిందా? రాసే ఉంటుంది లెండి..ఆడవాళ్లు అంతే..భర్త జేబులు డబ్బులున్నాయా? లేవా?అని ఆలోచించరు లిస్టు మాత్రం రాసి ఇచ్చేస్తారు..అని’ అభాండాలు వేయొద్దు.

సదరు భార్య భర్తమీద ఎంత ప్రేమ ఉందోగానీ లేదా ఆ భర్తకు ఇబ్బంది పడకూడదనో..లేదా ఎప్పుడు తానే షాపింగ్ కు వెళ్లి కావాల్సిన వస్తులు..కూరగాయలు తెచ్చుకునేదేమో..భర్త ఎప్పుడు షాపింగ్ కు వెళ్లలేదేమో గానీ ఆ భార్య రాసిచ్చిన కొనాల్సిన లిస్టు మాత్రం ఎంత ‘డిటెయిల్‌’గా ఉందో తెలిస్తే బంగారు చిలకమ్మ భార్యామణి అంటారు. ఈ ‘డిటెయిల్‌’ లిస్టుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది.

డిటెయిల్‌గా ఉన్న షాపింగ్ లిస్టు. ఎంత డిటెయిల్‌గా అంటే..భర్త వెళ్లాల్సిన సూపర్ మార్కెట్ ఎక్కడుంది? ఆ వ‌స్తువు పేరు.. దాని రేటు, ఇమేజ్‌లతో స‌హా.. అన్నింటినీ లిస్టులో పొందుప‌రిచిన ఆ భార్యామణి త‌న భ‌ర్త ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. అలాగే సూప‌ర్ మార్కెట్‌కు వెళ్లే దారికి సంబంధించిన మ్యాప్ కూడా గీసి.. ఏ ర్యాక్‌లో ఏ వ‌స్తువు ఉంటుందో దానికి సంబంధించిన వివ‌రాలు అన్నీ అంటే అన్నీ లిస్టులో మార్క్ చేసి ఇచ్చి త‌న భ‌ర్త‌ను మార్కెట్‌కు పంపించింది ఆ భార్యామ‌ణి.

ఈ వీడియోను మెలిండా అనే మ‌హిళ‌.. త‌న టిక్‌టాక్ అకౌంట్‌లో షేర్ చేసింది. వీడియో చివ‌ర్లో.. ఇదంతా ఉత్తుత్తి లిస్టే.. అంటూ చెప్పుకొచ్చి మనల్ని షాక్ కు గురిచేసింది. అది ఉత్తుత్తి లిస్టు అయినా.. ఏద‌యినా.. నెటిజ‌న్లు మాత్రం ఊరుకుంటారా ఏంటీ..ఆ వీడియోని సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ చేసి పారేస్తున్నారు. రకరకాల కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఒకరు ‘మీరు ఇంత ప‌క్కాగా పరఫెక్ట్ గా చిన్నపిల్లాడికి ఇచ్చినట్లుగా లిస్టు పంపిస్తున్నారు..మీ ఆయన మాత్రం కచ్చితంగా ఏదోకటి మరచిపోయి వస్తాడులే చూడు అంటే మరొకరు ఇన్ని రకాలు గా రాసిచ్చి పంపించినా ఆయన ఏదోకటి మర్చిపోతే బాబుకి ఉంటుందీ..వాచిపోద్ది అని సరదాగా అంటున్నారు.

కాగా..ఇటువంటిదే మ‌రో షాపింగ్ లిస్టు కూడా ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దాంట్లో కూడా కూర‌గాయాలు ఏవి తేవాలి. ఎన్ని తేవాలి.. అవి పండిన‌వా? లేక లేత‌వా? లాంటి అన్ని వివ‌రాలు అందులో ఉన్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు