World War Plane: భారత పర్వతాల్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి విమానం లభ్యం

ముగ్గురు గైడ్‌ల మరణానికి దారితీసిన కారణాలను అన్వేషించే క్రమంలో దాదాపు 80ఏళ్ల క్రితం తప్పిపోయిన రెండవ ప్రపంచ యుద్ధ విమానం ఆచూకీ లభించింది.

World War Plane: భారత పర్వతాల్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి విమానం లభ్యం

Flight

Updated On : January 25, 2022 / 8:09 AM IST
World War Plane: ముగ్గురు గైడ్‌ల మరణానికి దారితీసిన కారణాలను అన్వేషించే క్రమంలో దాదాపు 80ఏళ్ల క్రితం తప్పిపోయిన రెండవ ప్రపంచ యుద్ధ విమానం ఆచూకీ లభించింది. 1945లో 13మందితో దక్షిణ చైనాలోని కున్మింగ్ నుంచి బయల్దేరిన C-46 విమానం తుఫాను వాతావరణంలో అదృశ్యం అయ్యింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని పర్వతాల మీదుగా వెళ్తూ విమానం కనిపించకుండా పోయింది.
సరిగ్గా 77ఏళ్ల తర్వాత ఆ విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించారు. హిమాలయాల్లోని ప్రమాదకరమైన ఎత్తయిన ప్రాంతంలో విమాన శకలాలు లభ్యమయ్యాయి. విమానం తోక భాగంలోని నెంబర్ ఆధారంగా రెండవ ప్రపంచ యుద్ధం నాటి విమానంగా దానిని గుర్తించారు. అయితే, అక్కడ మానవ అవశేషాలు మాత్రం కనిపించలేదు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతంలో తుఫాను వాతావరణంలో అదృశ్యమైన ఈ విమానం గురించి క్లేటన్ కుహ్లెస్, ఈ ఫ్లైట్‌లో ఉన్నవారిలో ఒకరి కొడుకు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే, ముగ్గురు గైడ్‌లు సెప్టెంబర్ మంచు తుఫాను సమయంలో క్యాంప్ అవుట్ చేస్తూ అల్పోష్ణస్థితితో మరణించారు. వారి మరణ శోధనలో ఈ విమానం ఆచూకీ లభ్యమైంది.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశం, చైనా, మయన్మార్‌ ప్రాంతాల్లో వందలాది US సైనిక విమానాలు కనిపించకుండా పోయాయి. జపనీస్ దళాల నుంచి శత్రు కాల్పులు కొన్ని విమాన నష్టాలకు కారణం కాగా.., మంచుతో దెబ్బతినడం, హరికేన్-ఫోర్స్ గాలులు వల్ల మరికొన్ని విమానాలు కనిపించకుండా పోయాయి.