కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంటే రూ.3.30 లక్షలు బహుమతి!

  • Publish Date - March 13, 2020 / 10:25 AM IST

కరోనా వైరస్ పేరు చెబితే ప్రపంచమంతా వణికిపోతోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాల ప్రభుత్వాలో ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. కరోనాను నియంత్రించుకోవటమే తప్ప దానికి ఇప్పటి వరకూ మెడిసిన్ రాలేదు. కానీ ఓ సంస్థ కరోనా ను ఇంజెక్షన కనిపెట్టింది. దాన్ని పరీక్షిందామంటే ఎవ్వరూ ముందుకు రావటంలేదు. దీంతో భారీ ఆఫర్ ను ప్రకటించింది. (కరోనా స్పెషల్.. ఆనంద్ మహీంద్రాకు స్పెషల్ గిఫ్ట్)

లండన్‌లోని క్వీన్‌ మేరీ బయో ఎంటర్‌ప్రైజెస్‌ ఇన్నొవేషన్‌ సెంటర్‌ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసింది. దాన్ని మనుషులపై టెస్ట్‌ చేసేందుకు వాలంటీర్లు ఎవరూ ముందుకు రావటంలేదు.చాలామందిని అడిగారు. కానీ ఎవ్వరూ అంగీకరించలేదు. దీంతో దీంతో..ఆ కంపెనీ తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ఇంజెక్ట్‌ చేసుకుంటే 4వేల 588 డాలర్లు ( రూ.3.30 లక్షలు) ఇస్తామని ప్రకటించింది. అలా ఎవరైనా ముందుకొస్తే ఆ వ్యాక్సిన్‌ పనితీరును వారు పరీక్షించి పూర్తిస్థాయిగా సక్సెస్ అయితే దాన్ని త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేస్తారు.

ఇంజెక్షన్ తీసుకునేవారికి షరతులు 
ఈ వ్యాక్సిన్‌ ఇంజెక్ట్ చేయాలనుకునేవారికి కొన్ని నిబంధనలు కూడా విధించింది సదరు కంపెనీ.  ఇంజెక్షన్ చేయించుకోవాలనుకునే 18 ఏళ్ల పైబడి ఉండాలి. వారు యూకేలో నివసిస్తూ ఉండాలి. వ్యాక్సిన్‌ను తీసుకున్నాక 14 రోజులు సంస్థ ల్యాబ్‌లోనే ఉండాలి. బైటకు కూడా వెళ్లకూడదరు. ప్రతీ రోజూ వారు సూచించిన డైట్‌ తీసుకోవాలి. వాళ్లు చెప్పిన ఎక్సర్‌సైజ్‌ లు చేయాలి. (కరోనా దెబ్బకు నెల్లూరులో సినిమాహాల్స్, స్కూల్స్ బంద్, జనం బేజారు )

మరోవైపు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కూడా ఇలాగే ఓ వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. దాని పరీక్షల కోసం ఇప్పటికే ఆ సంస్థ 35 మంది వాలంటీర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ పరీక్షలు సక్సెస్ అయితే కరోనా వైరస్ కు వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది..!