De Villiers: డివిలియర్స్ రిటర్న్ అవడంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు క్లారిటీ
ఇంటర్నేషనల్ క్రికెట్ కు మిస్టర్ 360 తిరిగి వస్తాడని వార్తలపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఇదే ఏడాది చివర్లో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచ కప్ నాటికి జట్టులోకి
- Subhan Ali Shaik
- Published On : May 18, 2021 / 11:39 PM IST
De Villiers
De Villiers: ఇంటర్నేషనల్ క్రికెట్ కు మిస్టర్ 360 తిరిగి వస్తాడని వార్తలపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఇదే ఏడాది చివర్లో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచ కప్ నాటికి జట్టులోకి వస్తాడంటూ వార్తలు ప్రచారం చేశాయి. కానీ, ఒకసారి రిటైర్మెంట్ ఇచ్చేశాక తిరిగి వచ్చే అవకాశం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మంగళవారం తేల్చి చెప్పింది.
డివిలియర్స్ మనసు మార్చుకునే ఉద్దేశం లేదని బోర్డు స్పష్టం చేసింది. అతణ్ని అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే విషయంపై మరోమారు చర్చించామని, తన నిర్ణయంలో ఎటువంటి మార్పులేదని స్పష్టం చేసినట్లు దక్షిణాఫ్రికా బోర్డు ప్రకటనలో తెలిపింది.
2018 మే నెలలో డివిలియర్స్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని తిరిగి క్రికెట్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో డివిలియర్స్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావాలనుకున్నట్లు వార్తలు వచ్చాయి.
రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు పునరాగమనం చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. కరోనా కేసుల నేపథ్యంలో ఈ ఐపీఎల్ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
