AIIMS NORCET 2026 : 2,551 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు మరి కొన్ని గంటల్లో ముగియనున్న గడువు.. మీరు అప్లై చేశారా..?
AIIMS NORCET 2026 : దేశంలోని పలు ఎయిమ్స్ లలో ఖాళీగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
- Dharani Pilli
- Published On : March 15, 2026 / 09:22 PM IST
aiims 2551 nursing officer posts job notification eligibility and selection process complete details
AIIMS NORCET 2026 : దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గాను ‘నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్)-10’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ఎయిమ్స్ లలో ఖాళీగా ఉన్న సుమారు 2,551 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 16.. అంటే ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. కనుక అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకుంటే మంచిది. నోటిఫికేషన్ ద్వారా న్యూఢిల్లీ ఎయిమ్స్ తో పాటు.. దేశంలోని పలు ఎయిమ్స్ కేంద్రాల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.
ముఖ్యమైన సమాచారం…
- పోస్ట్ పేరు: నర్సింగ్ ఆఫీసర్
- మొత్తం ఖాళీలు: 2,551
- అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్: మార్చి 16, 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
- జీతం: పే లెవల్-07 (గ్రేడ్ పే రూ.4600/-తో కలిపి నెలకు సుమారు రూ.9,300 – 34,800 బేసిక్ పే ఉంటుంది).
అర్హతలు
- విద్యార్హత: B.Sc. (Hons.) Nursing / B.Sc. Nursing, Post Basic B.Sc. Nursing పూర్తి చేసి ఉండాలి.
- డిప్లొమా అభ్యర్థులు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM) డిప్లొమాతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
- వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి (నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).
ఎంపిక విధానం…
నర్సింగ్ ఆఫీసర్ ఎంపిక ప్రక్రియ ఎంపిక విధానం రెండు దశల్లో జరుగుతుంది
- దశ-1 (ప్రిలిమినరీ): ప్రిలిమినరీ కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష్. 100 మార్కులకు 90 నిమిషాల వ్యవధి ఇస్తారు. MCQ పరీక్ష ఉంటుంది.
- దశ-2 (Mains): రెండో దశలో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. మూడు గంటల వ్యవధిలో 160 మార్కులకు పరీక్ష ఉంటుంది.
నెగిటివ్ మార్కులు: రెండు దశల్లోనూ ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే విధానం…
- ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
- సరైన ఈమెయిల్, మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తర్వాత అప్లికేషన్ ఫామ్ లో వివరాలు నింపి.. అభ్యర్థి తన ఫోటో, సంతకం, తంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి, అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకోవాలి. ఏదైనా తప్పులు ఉంటే కరెక్షన్ విండో ద్వారా నిర్ణీత సమయంలో సవరించుకోవచ్చు.
