AAICLAS Recruitment 2026 : రాత పరీక్ష లేకుండానే ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.34 వేల జీతం.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు

AAICLAS Recruitment 2026 : రాత పరీక్ష లేకుండా విమానాశ్రాయాల్లో ఉద్యోగం పొందే అవకాశం మీ ముందుకు వచ్చింది.

Airport Authority of India Security Screener Recruitment 2026 Notification Out for 158 Posts Full Details here

AAICLAS Recruitment 2026 : రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు పొందే అవకాశం అంటే నిరుద్యోగులు ఎగిరి గంతేస్తారు. అలాంటి ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారి కోసమే ఇది. రాత పరీక్ష లేకుండా ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ (ఏఏఐసీఎల్ఏఎస్)లో సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అయితే ఇవి శాశ్వతమైనవి కావు.. మూడేళ్ల కాలానికి గాను కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ పోస్టుల పట్ల అర్హులైన అభ్యర్థులు.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ.. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 158 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సెలెక్టైన అభ్యర్థులు.. ఉదయ్‌పూర్, డెహ్రాడూన్, పాట్నా, త్రిచి, కాలికట్, కోల్‌కతాలోని ఎయిర్‌పోర్టుల్లో ఈ సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల్లో చేరి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు.. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.

  • మొత్తం పోస్టుల వివరాలు: 158

  • పాట్నాలో పోస్టుల సంఖ్య: 37
  • ఉదయ్‌పూర్‌లో పోస్టుల సంఖ్య: 34
  • త్రిచిలో పోస్టుల సంఖ్య: 28
  • కోల్‌కతాలో పోస్టుల సంఖ్య: 25
  • డెహ్రాడూన్‌లో పోస్టుల సంఖ్య: 17
  • కాలికట్‌లో పోస్టుల సంఖ్య: 17

అర్హతలు

  • ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పకుండా.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీలు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయోపరిమితి

  • అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి మే 1, 2026వ తేదీ నాటికి 27 ఏళ్లకు మించకుండా ఉండాలి.
  • ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ

  • ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 8, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.750.
  • ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

  • వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంటే ఎలాంటి రాత పరీక్ష ఉండదన్నమాట.

జీతం

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మూడేళ్లలో.. తొలి ఏడాది ప్రతి నెలా రూ.30 వేలు, రెండో ఏడాది ప్రతి నెలా రూ.32 వేలు, మూడో ఏడాది ప్రతి నెలా రూ.34 వేలు చొప్పున జీతం చెల్లిస్తారు.