AP HC Jobs 2026 : హైకోర్టులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు.. నెలకు రూ.రూ. 1,47,760 జీతం.. నోటిఫికేషన్ వచ్చేసింది..!
AP HC Jobs 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. కోర్టులో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేసన్ విడుదలయ్యింది.
- Dharani Pilli
- Published On : March 25, 2026 / 06:50 PM IST
andhra pradesh high court released notification for 300 vacancies complete details here
AP HC Jobs 2026 : తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు అలర్ట్.. హైకోర్టులో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 19 వరకు అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 300
- అసిస్టెంట్: 78
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 50
- టైపిస్ట్: 44
- కాపీయిస్ట్: 34
- కంప్యూటర్ ఆపరేటర్: 31
- ఎగ్జామినర్: 27
- ఆఫీస్ సబార్డినేట్: 20
- సెక్షన్ ఆఫీసర్స్: 05
- యూడీ స్టెనోగ్రాఫర్: 07
- సీనియర్ సిస్టమ్ ఆఫీసర్: 01
- అసిస్టెంట్ లైబ్రేరియన్: 01
- లైబ్రేరియన్ గ్రేడ్-II: 01
- స్టెనోగ్రాఫర్: 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ తరగతి / డిగ్రీ / బీటెక్ / లా డిగ్రీ / ఎమ్మెల్సీ (MLISc) పాస్ అయి ఉండాలి. టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ లేదా షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి.
జీతం: నెలకు రూ. 20,000 నుంచి రూ. 1,47,760 వరకు.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆధారంగా. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వయో పరిమితి: 01.01.2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 30.03.2026.
- దరఖాస్తు చివరి తేదీ: 19.04.2026.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://aphc.gov.in/docs/notification_1774248554_0.pdf
