CBI SO Recruitment 2026 : నెలకు రూ.1,20,940 జీతం.. ఈ బ్యాంకు జాబులకు అప్లై చేయడానికి ఇంకొన్ని గంటలే ఉంది
CBI SO Recruitment 2026 : బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి అలర్ట్. నెలకు రూ. లక్షకు పైగా జీతం వచ్చే జాబులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
- Dharani Pilli
- Published On : March 23, 2026 / 01:58 PM IST
central bank of india specialist officer recruitment 2026 online registration window Closing on 23 march
CBI SO Recruitment 2026 : బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఇది నిజంగా భారీ శుభవార్త అని చెప్పవచ్చు. ఈ జాబ్ కి సెలక్ట్ అయితే ఇక మీ జీవితం సెట్టు. ఎందుకంటే నెలకు రూ. 1,20,940 జీతం వస్తుంది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇంకా దరఖాస్తు చేయని వాళ్లుంటే త్వరపడండి. ఇంతకూ ఇవి ఏ బ్యాంకులో అంటే.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. CBIలో రెగ్యులర్ ప్రాతిపదికన హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ విభాగంలో వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరిలో ఈ నోటిఫికేషన్ విడుదలయ్యింది. వీటికి అప్లై చేసుకునేందుకు మార్చి 23 (సోమవారం) తో గడువు ముగుస్తుంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఇంకా అప్లై చేసుకోకపోతే.. త్వరపడండి. గడువు ముగియడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.
సెంట్రల్ ఆఫీస్‌లోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ విభాగం ద్వారా జరుగుతున్న ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా మొత్తం 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ఐటీ ఆఫీసర్, మొబైల్ డెవలపర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, డేటా సైంటిస్ట్, రిస్క్ మేనేజర్, డేటా ఆర్కిటెక్ట్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ డెవలపర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు:
ఈ పోస్టులకు అప్లై చేయాలని భావించే అభ్యర్థులు వాటికి తగ్గట్టుగా కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ లేదా సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి.
అనుభవం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే.. నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనల మేరకు పోస్టును బట్టి 2-10 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. పైన పేర్కొన్న అర్హతలు కలిగిన అభ్యర్థులు.. ఆన్‌లైన్ విధానంలో మార్చి 23 సాయంత్రం (నేడే) లోగా అప్లై చేసుకోవాలి.
ఫీజు:
దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ. 850 + 175 (జీఎస్టీ) రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి.
ఎంపిక విధానం:
ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం:
ఎంపికైన వారికి నెలకు రూ. 48,480 నుంచి రూ. 1,20,940 ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఆన్‌లైన్ పరీక్ష:
ఆన్‌లైన్ పరీక్ష తేదీ ఏప్రిల్ 2026లో ఉంటుంది.
