Court Jobs 2026 : పది పాస్ అయ్యారా.. రాత పరీక్ష లేకుండా కోర్టులో జాబు.. వెంటనే దరఖాస్తు చేసుకొండి

Court Jobs 2026 : నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతి పాస్ అయితే చాలు.. రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం మీకోసం..

jayashankar bhupalpally district court recruitment 2026 for office subordinate posts full details here

Court Jobs 2026 : మీరు పదో తరగతి పాస్ అయ్యారా.. ప్రభుత్వ ఉద్యోగం.. అందునా సొంత జిల్లాలో అయితే బాగుంటుంది అనుకుంటున్నారా.. అలాంటి వారికే ఈ వార్త. పదో తరగతి పాస్ అయిన వారికి, కోర్టు జాబులో చేరాలని భావించే వారికి శుభవార్త. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

అర్హత

ఈ పోస్టులకు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన వారు అర్హులు.

వయసు

అభ్యర్థుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీహెచ్‌సీలకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం

ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు.. ఆఫ్‌లైన్ విధానంలో ఏప్రిల్ 27, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం

ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం అప్లికేషన్ల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. మౌఖిక ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 15,600 జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.