NIT Warangal 2026 : డిగ్రీ, బీటెక్ చేసిన వారికి బంపరాపర్.. NIT వరంగల్ లో ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. వెంటనే అప్లై చేసుకొండి
NIT Warangal 2026 : NIT వరంగల్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆ వివరాలు..
- Dharani Pilli
- Published On : April 7, 2026 / 04:39 PM IST
NIT national institute of technology warangal released notification for recruitment of project associate And Junior research fellow posts details here
NIT Warangal 2026 : మీరు బీటెక్, డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. NIT వరంగల్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా వీటిని భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గేట్ స్కోర్ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా నిట్.. ప్రాజెక్ట్ అసోసియేట్–I, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనుంది. మరి వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. అర్హత ఏంటి.. వయసు ఎంత ఉండాలి.. అప్లై చేయడానికి చివరి తేదీ వంటి వివరాలు.
పోస్ట్ పేరు:
ప్రాజెక్ట్ అసోసియేట్–I..
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అర్హత:
గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. ఆయా విభాగాల్లో అనుభవం తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి:
30 సంవత్సరాలు. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
చివరి తేదీ:
ఏప్రిల్ 17.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జూనియర్ రీసెర్చ్ ఫెలో
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంఎస్సీతో పాటు గేట్/ నెట్ క్వాలిఫై ఉండాలి.
ఏజ్ లిమిట్:
28 సంవత్సరాలు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
అప్లికేషన్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్:
ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ:
ఏప్రిల్ 13.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ nitw.ac.inను సందర్శించండి.
