RBI JE 2026 Notification : డిగ్రీ పూర్తి చేస్తే RBI లో ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతం.. వెంటనే అప్లై చేసుకొండి
RBI JE 2026 Notification : ఆర్బీఐలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.
- Dharani Pilli
- Updated on- April 26, 2026 / 09:17 PM IST
rbi recruitment 2026 notification for 11 junior engineer posts full details here
RBI JE 2026 Notification : బ్యాంకు ఉద్యోగాల కోసం చూసేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా పలు బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో 7 జూనియర్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు కాగా.. మిగతా 4 జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మే 6 వరకు.. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత:
ఆర్బీఐలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు:
అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 1, 2026 నాటికి 20 – 30 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టులను బట్టి అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు విధానం:
పైన పేర్కొన్న అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మే 6, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష తేదీ:
ఆన్లైన్ పరీక్ష జూన్ 2026లో ఉంటుంది.
రాత పరీక్ష విధానం:
రాత పరీక్ష మొత్తం 180 ప్రశ్నలకు 300 మార్కులకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు.
-
ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్ విభాగంలో: 50 ప్రశ్నలకు 50 మార్కులు.
-
ఇంజనీరింగ్ పేపర్ (డిస్క్రిప్టివ్) 1 విభాగంలో: 40 ప్రశ్నలకు 100 మార్కులు.
-
ఇంజనీరింగ్ పేపర్ (డిస్క్రిప్టివ్) 2 విభాగంలో: 40 ప్రశ్నలకు 100 మార్కులు.
-
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగంలో: 50 ప్రశ్నలకు 50 మార్కులు.
