rrb group d recruitment notification 2026 22195 post apply last date on march 9
RRB Group D Recruitment : పదో తరగతి పాస్ అయ్యి ఉండి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి భారతీయ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. 22 వేలకు పైగా గ్రూప్ డీ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్ల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇవాళే ఆఖరి తేదీ. అంటే మరి కొన్ని గంటల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియబోతుంది. కనుక ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయకపోతే.. వెంటనే అప్లై చేసుకోవచ్చు. మార్చి 9తో ఈ పోస్టులకు దరఖాస్తు చేసే సమయం ముగిసిపోతుంది. పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
భారతీయ రైల్వే ప్రతి ఏడాది వేల సంఖ్యలో పలు ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. అయితే వీటిల్లో గ్రూప్ డీ పోస్టులకు విపరీతమైన పోటీ ఉంటుంది. పదో తరగతి అర్హత కావడంతో చాలా మంది ఈ ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటారు. ఈక్రమంలో తాజాగా రైల్వే శాఖ 22,195 గ్రూప్ డీ ఉద్యోగుల భర్తీకి సిద్ధమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 9, 2026వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా.. రైల్వే శాఖ పాయింట్స్‌మన్, అసిస్టెంట్, అసిస్టెంట్ ఆపరేషన్స్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్ వంటి తదితర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 22,195 పోస్టుల్లో.. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ జోన్లో 1,012 వరకు పోస్టులు ఉన్నాయి. రెండు రాష్ట్రాల నుంచి ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జోనల్ వారీగా ఖాళీల సంఖ్య ఇలా..
వీటిల్లో అత్యధిక పోస్టులు నార్తన్ రైల్వే ఢిల్లీ 3553 ఉండగా.. ఆ తర్వాత వెస్ట్రన్ రైల్వే ముంబై 3,148 ఖాళీలు ఉన్నాయి. అల్పంగా సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీలో 90 పోస్టులు మాత్రమే ఉన్నాయి.
ఎలక్ట్రికల్, మెకానికల్, ట్రాఫిక్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితో పాటుగా తప్పనిసరిగా.. సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాంటి వారే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 9 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. మార్చి 12 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తుల్లో మార్పులకు అవకాశం ఉంటుంది.
ఏజ్ లిమిట్
ఆర్ఆర్బీ గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు అభ్యర్థుల జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500గా నిర్ణయించారు.
ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
జీతం
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి ప్రారంభ వేతనం ఉంటుంది. ఇతర అలవెన్స్‌లు కూడా కల్పిస్తారు.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), చివరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆపై మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి.. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష అయిపోయిన తర్వాత వారు చెల్లించిన దరఖాస్తు రుసుములో కొంత మేర రీఫండ్ చేస్తారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500 నుంచి 400 రూపాయలు రీఫండ్ చేస్తారు. అలానే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈఎస్ఎం, దివ్యాంగ అభ్యర్థులకు వారు చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా రీఫండ్ చేస్తారు.