RRB Technician Jobs 2026 : రైల్వే ఉద్యోగాల కోసం చూసేవారికి శుభవార్త.. 6,565 ఖాళీలు.. పదో తరగతి పాస్ అయితే చాలు

RRB Technician Jobs 2026 : నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది.

RRB Technician Recruitment 2026 Notification Out for 6565 Grade III Posts

RRB Technician Jobs 2026 : మన దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరిగే శాఖ రైల్వే డిపార్ట్‌మెంట్. ప్రతి సంవత్సరం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఆధ్వర్యంలో కొన్ని వేల సంఖ్యల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తుంటారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా RRB నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 6,565 టెక్నీషియన్ గ్రేడ్ I (సిగ్నల్) మరియు గ్రేడ్ III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక RRB అప్లై పోర్టల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 30, 2026 నుండి జూలై 29, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమైన వివరాలు, తేదీలు:

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: మే 18, 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: జూన్ 30, 2026
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: జూలై 29, 2026 (రాత్రి 11:59 గంటల వరకు)

ఖాళీలు-జీతాల వివరాలు

  • మొత్తం ఖాళీలు: 6,565 పోస్టులు
  • టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్: 323 ఖాళీలు
  • టెక్నీషియన్ గ్రేడ్ III: 6,242 ఖాళీలు

వేతనం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ ప్రకారం లెవల్ 2 నుండి లెవల్ 5 వరకు ఉంటుంది. ప్రారంభ వేతనం రూ. 19,900 నుండి రూ. 29,200 వరకు ఉంటుంది.

అర్హత ప్రమాణాలు

  • వయోపరిమితి:

  • టెక్నీషియన్ గ్రేడ్ I: 18 నుండి 33 సంవత్సరాలు
  • టెక్నీషియన్ గ్రేడ్ III: 18 నుండి 30 సంవత్సరాలు
  • గమనిక: రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు అవకాశం కల్పిస్తారు.
  • విద్యార్హత:

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ (ITI) తో పాటు మెట్రిక్యులేషన్/SSLC ఉత్తీర్ణులై ఉండాలి.
  • గ్రేడ్ I సిగ్నల్ పోస్టుల కోసం, సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలలో డిగ్రీ/డిప్లొమా ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియ క్రింది దశల్లో జరుగుతుంది:

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గణితం, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ అంశాలపై 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) – ధృవపత్రాల పరిశీలన
  • మెడికల్ ఎగ్జామినేషన్ – వైద్య పరీక్షలు

ముఖ్య గమనిక: జోన్ల వారీగా ఖాళీల వివరాలు మరియు పూర్తి విద్యా అర్హతల కోసం, మీరు మీ ప్రాంతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి నోటిఫికేషన్‌ను చూడవచ్చు.