SECL Recruitment 2026 : పదో తరగతి పాస్ అయ్యారా.. చేరిన వెంటనే నెలకు రూ.50 వేల జీతంతో సర్కార్ కొలువు.. అస్సలు మిస్ చేసుకోకండి

SECL Recruitment 2026 : పదో తరగతి పాస్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. ఈ జాబ్ కొడితే.. చేరిన నాటి నుంచే నెలకు రూ.50 వేల జీతం అందుకోవచ్చు.

SECL Recruitment 2026 1055 vacancies announced for Mining Sirdar Foreman and Surveyor posts Full details here

SECL Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల శాఖకు చెందిన.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఎస్‌ఈసీఎల్‌ (సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా గనులు, పెద్ద సంఖ్యలో సాంకేతిక ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,055 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో మైనింగ్ సర్దార్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మన్ (ఎలక్ట్రికల్) పోస్టులు ఉన్నాయి.

ఈ అన్ని పోస్టులు టీఅండ్ఎస్ గ్రేడ్-C కిందకు వస్తాయి. ఈ ఉద్యోగాలకు ప్రారంభ ప్రాథమిక వేతనం రూ. 47,330 గా నిర్ణయించారు. గతంలో వచ్చిన అప్రెంటిస్ నోటిఫికేషన్లతో పోలిస్తే, ఈ నియామకాలు శాశ్వత ఉద్యోగాల కోసం కావడం వల్ల అభ్యర్థులకు జాబ్ గ్యారెంటీ ఉంటుంది.

పోస్టుల వివరాలు, వేతనం:

  • మైనింగ్ సర్దార్: 577 పోస్టులు (అత్యధికం)
  • అసిస్టెంట్ ఫోర్‌మన్ (ఎలక్ట్రికల్): 435 పోస్టులు
  • డిప్యూటీ సర్వేయర్ (మైనింగ్): 43 పోస్టులు

ఎంపికైన అభ్యర్థులందరికీ ఒకే విధంగా టీఅండ్ఎస్ గ్రేడ్-C కింద రూ. 47,330 ప్రాథమిక వేతనం ఉంటుంది.

రిజర్వేషన్ వివరాలు:

ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC (నాన్ క్రీమీ లేయర్), EWS మరియు జనరల్ కేటగిరీలకు పోస్టులు కేటాయించారు. మైనింగ్ సర్దార్ పోస్టుల్లో 225 జనరల్ సీట్లు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ఫోర్‌మన్ (ఎలక్ట్రికల్) పోస్టుల్లో PwBD అభ్యర్థులకు 17 సీట్లు ఉన్నాయి.

దరఖాస్తు ప్రక్రియ:

ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ 2026 ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అధికారిక SECL వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.

దరఖాస్తు విధానం:

SECL వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వాలి.

లాగిన్ వివరాలతో సైన్ ఇన్ కావాలి.

వ్యక్తిగత, విద్యా, కేటగిరీ వివరాలు నమోదు చేయాలి.

ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాలి.

ఫారాన్ని జాగ్రత్తగా గమనించి.. అక్కడ అడిగిన వివరాలన్నింటినీ ఎంటర్ చేయాలి.