Nizamabad Adavi Mamidipalli Patriotism :దేశ భక్తుల గ్రామం.. 16ఏళ్లు వస్తే అందరి టార్గెట్‌ ఆర్మీనే!

సైన్యంలో పని చేయాలంటే ధైర్యం కావాలి. దేశానికి సేవ చేయాలన్న తపన ఉండాలి. అలా నరనరాన దేశభక్తిని నింపుకున్న గ్రామం నిజామాబాద్‌ జిల్లాలో ఉంది. తరతరాలుగా ఆర్మీలో సేవలందిస్తోంది. ఆ ఊళ్లో 16ఏళ్లు వచ్చిన ప్రతి యువకుడి లక్ష్యం సైనికుడు కావడమే. ఏటా కనీసం 10 మంది బోర్డర్‌కు వెళ్తున్నారంటే.. వాళ్ల కమిట్‌మెంట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థమవుతోంది.

Nizamabad Adavi Mamidipalli Patriotism : సైన్యంలో పని చేయాలంటే ధైర్యం కావాలి. దేశానికి సేవ చేయాలన్న తపన ఉండాలి. అలా నరనరాన దేశభక్తిని నింపుకున్న గ్రామం నిజామాబాద్‌ జిల్లాలో ఉంది. తరతరాలుగా ఆర్మీలో సేవలందిస్తోంది. ఆ ఊళ్లో 16ఏళ్లు వచ్చిన ప్రతి యువకుడి లక్ష్యం సైనికుడు కావడమే. ఏటా కనీసం 10 మంది బోర్డర్‌కు వెళ్తున్నారంటే.. వాళ్ల కమిట్‌మెంట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థమవుతోంది.

ఈ రోజుల్లో ఉద్యోగమంటే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరే. యూత్‌ టార్గెట్‌ అదే. కానీ.. దేశసేవను మించిన ఉద్యోగం ఏముందని భావించే యువకులు కూడా చాలామందే ఉన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఓ గ్రామమంతా అలాంటి దేశభక్తులతోనే నిండిపోయింది. నిజామాబాద్‌కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఊరి పేరు అడవి మామిడిపల్లి. కేవలం 1500మంది జనాభా ఉండే ఆ ఊళ్లో యువతను చూస్తే దేశసేవ కోసమే పుట్టారా అనిపిస్తుంది.

Independence Day Celebrations Red Fort : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట..10వేల మంది పోలీసులతో భద్రత..1000 సీసీ కెమెరాలు ఏర్పాటు

ఎంత గొప్ప పనైనా ఒక్కరితోనే మొదలవుతుంది. అడవి మామిడిపల్లిలో కూడా అంతే. చాలా ఏళ్ల క్రితం ఆ ఊరి నుంచి ఓ యువకుడు ఆర్మీలో చేరాడు. అతడ్ని అందరూ ఆదర్శంగా తీసుకున్నారు. 16 ఏళ్ల వచ్చాయంటే చాలు.. ప్రతి ఒక్కరి టార్గెట్‌ ఆర్మీనే. పేరెంట్స్‌ సపోర్ట్‌ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఆ ఒక్క ఊరి నుంచే ఇప్పటిదాకా 45మంది యువకులు సైన్యంలో చేరారు. అయితే తమవాళ్లు కళ్లముందున్న లేరన్న బాధ ఉన్నా.. దేశ సేవ కంటే గొప్ప అదృష్టం ఏముంటుందంటూ తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు గర్వంగా చెప్పుకుంటారు.

ఇప్పటికే ఆర్మీలో పనిచేస్తున్న యువకులు.. తమ గ్రామంలో ఔత్సాహికులకు సపోర్ట్‌గా ఉంటారు. ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ నుంచి రిటెన్‌ టెస్టుల దాకా.. ఎలా ప్రిపేర్‌ అవ్వాలో నేర్పిస్తుంటారు. దాంతో ఎప్పుడు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ జరిగినా.. అడవి మామిడిపల్లి యువకులు సెలెక్ట్‌ అవ్వాల్సిందే. ఇదంతా తమ సీనియర్లు, పేరెంట్స్‌ సపోర్ట్‌ వల్లే సాధ్యమవుతుందంటున్నారు.

Eagle National Flag : జాతీయ పతాకాన్ని నోట కరచుకుని మానేరు డ్యామ్‌పై చక్కర్లు కొట్టిన గద్ద

ఇంటికో యువకుడు ఆర్మీలో చేరాలన్నది ఆ ఊరి లక్ష్యం. ఎక్కడ ఎప్పుడు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ జరిగినా ఈ ఊరి నుంచి ఐదారుగురు యువకులు ఎంపికవుతుంటారు. కంప్యూటర్‌ ముందు కూర్చుంటేనే ఉద్యోగం.. ఐదంకెల జీతం సంపాదిస్తేనే జీవితం అనుకునే వారికి అడవి మామడిపల్లి వాసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశానికి సేవ చేయడం కంటే అదృష్టం ఏముందని నిరూపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు