కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయిన ఘటన మరువక ముందే ఛత్తీస్ ఘడ్ లో రెండు ఏనుగులు చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే వీటికి పరీక్షలు నిర్వహించేందుకు తరలిస్తున్న సమయంలో చనిపోయిన ఏనుగు చుట్టూ ఏనుగుల మంద గుంపుగా చేరి విలపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఛత్తీస్ ఘఢ్ లోని సూరజ్ పూర్ డివిజన్ అడవి ప్రాంతంలో గురువారం (జూన్ 11, 2020)న ఒక ఏనుగు మృతదేహాన్ని గుర్తించారు. ప్రతాపూర్ బ్లాక్ వద్ద ఉన్న అడవిలో ఒక ఏనుగు మృతిచెందిందని ANI తెలిపింది. సూరజ్ పూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జె ఆర్ భగత్ మాట్లాడుతూ.. ఏనుగులు ఎలా చనిపోయాయి అనే విషయం పై దర్యాప్తు కొనసాగుతుందని, పోస్టుమార్టం రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.
గత రెండు రోజులుగా సూరజ్ పూర్ జిల్లాలో రెండు ఏనుగులు మృతదేహాలు కనిపించాయి అని అన్నారు. వీటిలో ఒక మృతదేహం చుట్టూ ఏనుగుల మంద గుంపులు గుంపులుగా గుమ్మి గూడటంతో పోస్టుమార్టం నిర్వహించలేకపోయామని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు. కానీ కొన్ని ప్రాధమిక ఆధారాల బట్టి చూస్తూ ఏనుగుల శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించటం లేదు. ఏదైనా విషప్రయోగం వల్ల చనిపోయి ఉంటాయోనని అడవిలోని నీటిని పరీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కశ్వాన్ ఈ ఘటనపై స్పందిస్తూ, ఒక ఫొటోను షేర్ చేశారు. ఏనుగులు కూడా మనుషుల మాదిరిగానే తమ కుటుంబ సభ్యులతో బలమైన బంధాన్ని కలిగి ఉంటాయని చెప్పారు. ఏనుగుల్లో ఏదైనా చనిపోయినప్పుడు ఏడుస్తున్నాయని తెలిపారు. గతేడాది ఓ పిల్ల ఏనుగు విద్యుత్ తీగలు తగిలి చనిపోయిన ఘటన తనకు ఇంకా గుర్తుందని కశ్వాన్ చెప్పారు.
Read: పరోటా.. రోటీ ఒకటి కాదు.. జీఎస్టీ 18శాతం వర్తిస్తుంది