Bharath Jodo yatra : కొరడాతో కొట్టుకున్న రాహుల్ గాంధీ .. వీడియో వైరల్

సంగారెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ సంప్రదాయంలో భాగమైన పోతరాజులను గౌరవిస్తూ కొరడాలతో కొట్టుకున్నారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్ ని ఉత్సాహపరిచారు. జగ్గారెడ్డి కొరడాలతో కొట్టుకున్నారు. రాహుల్ గాంధీ కూడా పోతరాజుల కొరడాలతో కొట్టుకుంటు డ్యాన్సులు వేశారు.

bharat jodo yatra Rahul gandhi  hits himself with the whip

Bharath Jodo yatra : తెలంగాణలో రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయలను గౌరవిస్తు..అనుసరిస్తు అడుగులు వేస్తున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పాదయాత్రలో రాహుల్ గాంధీ గిరిజనులతో కలిసి వేసిన డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో రాహుల్‌ గిరిజన సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు.

తాజాగా సంగారెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ సంప్రదాయంలో భాగమైన పోతరాజులను గౌరవిస్తూ కొరడాలతో కొట్టుకున్నారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్ ని ఉత్సాహపరిచారు. జగ్గారెడ్డి కొరడాలతో కొట్టుకున్నారు. రాహుల్ గాంధీ కూడా పోతరాజుల కొరడాలతో కొట్టుకుంటు డ్యాన్సులు వేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

జోడో యాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాకు చేరుకుంది. పాదయాత్ర పొడవునా ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు అక్కడక్కా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి.. టీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడుతున్నారు. అంతేకాదు పిల్లలతో సరదాగా ఆడుతూ… సంప్రదాయ నృత్యాలు చేస్తూ .. కాంగ్రెస్ కేడర్‌లో సరికొత్త జోష్ నింపుతున్నారు రాహుల్ గాంధీ.

దీంట్లో భాగంగా రాహుల్ గాంధీ గురువారం (నవంబర్ 3,2022) ఉదయం 6 గంటలకు రుద్రారంలోని గణేశ్ ఆలయం నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ఉదయం 10 గంటలకు సంగారెడ్డిలోని హునుమాన్ నగవర్ వద్దకు యాత్రకు విరామం ఇచ్చారు. ఈరోజు యాత్రలో పలు ప్రత్యేక కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గిరిజన కళాకారులతో కలిసి రాహుల్ గాంధీ థింసా నృత్యం చేశారు. పోతరాజుల కొరడాలను కొట్టుకున్నారు. పోతరాజుల కొరడాలను కొట్టుకున్నారు. పోచమ్మలోల్ల కులస్థులతో కలిసి స్టెప్పులేశారు.

చిన్నారులతో కలిసి ఆటలాడారు. కరాటే నేర్చుకునే చిన్నారలతో కలిసి ఆటలాడుతు సందడి చేశారు రాహుల్. చిన్నారులు తమ చేతులతో కిక్ కొడుతుంటే తన చేతి అడ్డుపెట్టి వన్స్ మోర్ అంటూ ప్రోత్సహించారు. ఇలా చిన్నారులతో కలిసి ఆటలాడుతు తాను కూడా చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తున్నాడీ కాంగ్రెస్ నేత. జోడో యాత్రలో రాహలు ఉత్సాహం చూసిన  కాంగ్రెస్ క్యాడర్ ఖుషీ అయిపోతున్నారు. చిన్నారులను భుజాలపై ఎక్కించుకుని వారితో కలిసి డ్యాన్సులు వేస్తు జోడో యాత్రలో ముందుకు ఇనుమడించిన ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు రాహుల్ గాంధీ. స్థానికంగా ఉన్న సంప్రదాయాలను పాటిస్తు అడుగులు ముందుకేస్తున్నారు