Rahul Gandhi is silent: రాజస్తాన్ ఘటనపై రాహుల్ గాంధీకి బీజేపీ ప్రశ్నల వర్షం

నెటిజెన్లు సైతం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నేరాలు జరిగినప్పుడు రాహుల్ కానీ ప్రియాంక కానీ కనీసం మానవతావాద దృక్పథంతోనైనా స్పందించడం లేదని, రాజకీయాలు అవసరమైనప్పుడే హడావుడి చేస్తారని మండిపడుతున్నారు. ఛత్తీస్‭గఢ్, రాజస్తాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేరాలు కాంగ్రెస్ పరిగణలోకి రావని, ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. రాహుల్ మౌనం వెనుక అసలు కారణమిదేనని నెటిజెన్లు విమర్శిస్తున్నారు.

Rahul Gandhi is silent: రాజస్తాన్‭లో 9 ఏళ్ల దళిత విద్యార్థి మరణంపై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని భారతీయ జనతా పార్టీ నిలదీసింది. అమాయక చిన్నారిని కుల దురహంకారంతో కొట్టి చంపితే రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియా ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైనా జరిగితే బారీకేడ్లను దాటుకుని వచ్చి హంగామా చేసే అన్నాచెల్లెల్లు ఇప్పుడు కనిపించడం లేదని, బహుశా రాజస్తాన్ కాంగ్రెస్ పాలనలో ఉంది కాబట్టి వారి దృష్టిలో నేరం కాకపోవచ్చని ఆయన ఎద్దేవా చేశారు.

‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రి అచేతనంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అనేక నేరాలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. ఎక్కడ చిన్న సంఘటన జరిగినా వాలిపోయే అన్నా చెల్లెల్లు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. నేరాల జాబితాలో రాజస్తాన్ లేదేమో. యూపీలో హైడ్రామా చేసిన రాహుల్ గాంధీ ఇక్కడికి ఎందుకు వెళ్లడం లేదు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినప్పుడే వారు స్పందిస్తారా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగితే నేరం కాదా?’’ అని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పూనియా అన్నారు.

ఇక నెటిజెన్లు సైతం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నేరాలు జరిగినప్పుడు రాహుల్ కానీ ప్రియాంక కానీ కనీసం మానవతావాద దృక్పథంతోనైనా స్పందించడం లేదని, రాజకీయాలు అవసరమైనప్పుడే హడావుడి చేస్తారని మండిపడుతున్నారు. ఛత్తీస్‭గఢ్, రాజస్తాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేరాలు కాంగ్రెస్ పరిగణలోకి రావని, ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. రాహుల్ మౌనం వెనుక అసలు కారణమిదేనని నెటిజెన్లు విమర్శిస్తున్నారు.

Dalit boy beaten to death: రాజస్తాన్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాయావతి

ట్రెండింగ్ వార్తలు