Chrutha
Leopard Cubs Face : కొన్ని ఫొటోలు మెదడుకు పని చెబుతుంటాయి. అందులో ఏముందో గుర్తు పెట్టండి ? ఒకరితో పాటు మరొకరు కూడా ఉన్నారు గుర్తు పట్టగలరా ? అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. ఇవి తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని ఇండియన్ ఫారెస్ట్ అధికారి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఫొటోలో ఓ చిరుత పులి ఉంది. మరొక చిరుత పులి కూడా ఉంది. గుర్తు పట్టగలరా అంటూ నెటిజన్లకు ప్రశ్నించారు.
ఇండియన్ ఫారెస్టు అధికారి పర్వీన్ కశ్వన్..కొన్ని రకాల వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తుంటారు. అలాగే..ఓ ఫొటో పోస్టు చేశారు. అందులో చెట్టుపై చిరుత ఎక్కి కూర్చొంది. అయితే..ఇందులో చిరుత ఒక్కటే లేదు. మరో చిరుత పిల్ల కూడా దాగి ఉంది. ఫొటోలో దానిని గుర్తు పట్టాలి. అయితే..కొంత నిశితంగా గమనిస్తే గాని..ఈ చిన్ని చిరుతను గుర్తు పట్టలేం.
కావాలంటే..ఓ క్లూ కూడా ఇస్తాను..అంటూ చెప్పారాయాన. ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే..రెండు తోకలు కనిపిస్తాయి. ఇప్పుడు చెట్టు మధ్యలో పరిశీలిస్తే..కొంచెం సులభంగా గుర్తించవచ్చని వెల్లడించారు అధికారి పర్వీన్ కశ్వన్. తోక కనిపించడం వల్ల చిరుతను గుర్తించడం సులభంగా మారిందని, తోక లేకుంటే..కష్టమయ్యేదని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.