షియోమీ, రియల్‌మికి పోటీగా : OnePlus చీపెస్ట్ స్మార్ట్ టీవీ జూలై 2న వస్తోంది!

  • Publish Date - June 8, 2020 / 08:59 AM IST

భారత మార్కెట్లో చైనా ప్రొడక్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే చైనీస్ బ్రాండ్లు భారత మార్కెట్లో సేల్స్ సునామీ సృష్టిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీల వరకు అన్నింటిలో చైనా కంపెనీలదే పైచేయి. అలాంటి చైనీస్ కంపెనీ వన్ ప్లస్ నుంచి సరికొత్త స్మార్ట్ టీవీ భారత మార్కెట్లోకి వస్తోంది. అది కూడా చౌకైన ధరకే రాబోతోంది. ఇదివరకే స్మార్ట్ ఫోన్లతో ఇండియన్ మార్కెట్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన వన్ ప్లస్.. స్మార్ట్ టీవీ మార్కెట్ ను విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. జూలై 2 నుంచి భారత మార్కెట్లోకి చౌకైన వన్ ప్లస్ స్మార్ట్ టీవీని ప్రవేశపెట్టబోతోంది. ఇండియన్ మార్కెట్లో పాపులర్ చైనీస్ కంపెనీలు షియోమీ, రియల్ మిలకు నేరుగా పోటీనిచ్చేందుకు వన్ ప్లస్ ఈ చీపెస్ట్ స్మార్ట్ టీవీని రిలీజ్ చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో వన్ ప్లస్ నుంచి స్మార్ట్ టీవీ సిగ్మెంట్ నుంచి OnePlus TV Q1, వన్ ప్లస్ TV Q1 Pro మోడళ్లను రిలీజ్ చేసింది.

ఈ రెండు స్మార్ట్ టీవీలను ప్రీమియం ఆఫర్ల కింద మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ప్రారంభ ధర రూ.69వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. భారత వినియోగదారులకు చౌకైన ధరకే అందించడమే లక్ష్యంగా వన్ ప్లస్ కంపెనీ చీపెస్ట్ స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని వన్ ప్లస్ సీఈఓ Pete Lau ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. భారత వినియోగదారుల కోసం జూలై 2న లాంచ్ చేయనున్నట్టు ట్వీట్ చేశారు. ఖరీదైన ప్రీమియం స్మార్ట్ టీవీల్లో మాదిరిగానే చౌకైన స్మార్ట్ టీవీల్లోనూ అదే ఫీచర్లతో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 

వన్ ప్లస్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ టీవీ ధర 200 డాలర్లు (రూ.15 వేలు). మిడ్ రేంజ్ స్మార్ట్ టీవీల్లో ప్రారంభ ధర రూ.20వేలు నుంచి రూ. 40వేలు వరకు ఉంటుంది. జనవరి-మార్చి రిపోర్టులో భారత ఎంట్రీ లెవల్ స్మార్ట్ టీవీ సిగ్మంట్లలో (రూ.20వేలు లోపు) ధరతో మొత్తం స్మార్ట్ టీవీ మార్కెట్ 45 శాతం వరకు ఉంది. 2020 తొలి త్రైమాసికంలో ఏడాదిలో 80శాతం మేర వృద్ధి సాధించింది. మిడ్ లెవల్ సిగ్మంట్ (రూ.40వేలు వరకు) మార్కెట్ షేర్ తో 33 శాతం వరకు ఉంది. 

Read: మీకు వాట్సప్‌లో డబ్బులు పంపడం తెలుసా..