Lal Darwaja Bonalu
Lal Darwaja Bonalu: హైదరాబాద్ మహానగరంలో ఆదివారం ఘనంగా బోనాల జాతర జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాల్ దర్వాజ అమ్మవారి పాత దేవాలయం వద్ద జరిగిన బోనాల్లో ఘర్షణ తలెత్తింది. ఇద్దరు పోతురాజులకు చెందిన వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే గమనించిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
Smriti Irani: కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన స్మృతి ఇరానీ
లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ చౌహాన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా ఒక వర్గం తమపై దాడి చేసిందని మరో వర్గం ఆందోళన చేపట్టింది. నిందితులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదని, అంతా ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు.