Smriti Irani: కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జోయిష్.. గోవాలో అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. వీటిని ఖండించిన స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేతలకు తాజాగా లీగల్ నోటీసులు జారీ చేశారు.

Smriti Irani: కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన స్మృతి ఇరానీ

Smriti Irani: తన కూతురుపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలకు కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు పంపారు. రాత పూర్వకంగా, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆ నోటీసుల్లో సూచించారు. స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీపై ఇటీవల కాంగ్రెస్ పార్టీతోపాటు, ఆ పార్టీ నేతలు జై రామ్ రమేష్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజాలు ఆరోపణలు చేశారు.

Volcano Erupts: జపాన్‪‌లో బద్ధలైన అగ్నిపర్వతం.. హై అలర్ట్ జారీ

గోవాలో జోయిష్ ఇరానీ అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారని వాళ్లు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలుగా కొన్ని వీడియోలను కూడా విడుదల చేశారు. అయితే, ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ ఖండించారు. తన కూతురుకు, బార్ అండ్ రెస్టారెంట్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాలేజీలో చదువుకుంటున్న తన 18 ఏళ్ల కూతురు బార్ ఎలా నిర్వహిస్తుందని స్మృతి ఇరానీ అన్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల గురించి మాట్లాడుతున్నందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. దీనికి చట్ట పరంగానే సమాధానం చెబుతానన్నారు. తాజాగా ఈ ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని కోరుతూ లీగల్ నోటీసులు పంపారు.

Son Murdered By Father: కొడుకును చంపి ముక్కలుగా నరికిన తండ్రి.. తప్పించుకునేందుకు ఏం చేశాడంటే

తనను, తన వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని దెబ్బతీసేందుకే కుట్ర పూరితంగా ఈ ఆరోపణలు చేశారని ఆమె నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆరోపించినట్లుగా జోయిష్ ఇరానీ ఎలాంటి బార్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయలేదని, ఎలాంటి షోకాజ్ నోటీసు ఆమెకు రాలేదని నోటీసుల్లో వివరించారు. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.