Varanasi : ఒడిశా, ఆఫ్రికా అయిపోయింది.. వారణాసి సినిమా నెక్స్ట్ షూటింగ్ ఎక్కడో తెలుసా?
ఎప్పుడూ లేని విధంగా రాజమౌళి ఈసారి శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. (Varanasi)
Varanasi
Varanasi : రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న భారీ సినిమా వారణాసి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా రానుందని ప్రకటించడంతో మహేష్ ఫ్యాన్స్ తో పాటు పేక్షకులు అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.(Varanasi)
ఎప్పుడూ లేని విధంగా రాజమౌళి ఈసారి శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 50 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఇప్పటివరకు వారణాసి సినిమాను ఒడిశా అడవులు, ఆఫ్రికా అడవులు, హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్స్ లో షూటింగ్ చేసారు. త్వరలో మరో కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలు కానుంది.
Also See : Malavika Mohanan : బ్లాక్ డ్రెస్ లో అందాలతో రఫ్ఫాడిస్తున్న రాజాసాబ్ బ్యూటీ..
వారణాసి సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ జార్జియా దేశంలో జరగనుందని సమాచారం. జార్జియా దేశంలో కొన్ని అడ్వెంచరస్ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా షూట్ చేయబోతున్నారని, 15 రోజుల పాటు ఈ షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. ఇది అయ్యాక కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో వేసిన సెట్ లో షూటింగ్ చేస్తారని సమాచారం.
మొత్తానికి రాజమౌళి వారణాసి సినిమాని గ్లోబ్ ట్రాటర్ అంటూ ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో గ్రాండ్ గానే తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 800 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ టార్గెట్ గా రాజమౌళి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకే వారణాసి కి సంబంధించి ఏ అప్డేట్ అయినా హాలీవుడ్ లో కూడా ప్రమోషన్ చేయిస్తున్నాడు రాజమౌళి.
Also Read : Mohan Babu : కిడ్నాప్ చేసారంటూ.. మోహన్ బాబు, మంచు విష్ణుపై కేసు నమోదు..
ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటి కాలంతో పాటు త్రేతాయుగం, భవిష్యత్తు కథాంశాలతో కూడా కలిపి తెరకెక్కుతుంది. ఇందులో మహేష్ బాబు రాముడిగా కూడా కనిపించబోతున్నాడు.
