లాక్ డౌన్‌లో ఎక్కువ సేపు నిద్రపోవటం మంచిది కాదంట.. పరిశోధనలో తేలింది!

  • Publish Date - June 12, 2020 / 10:41 AM IST

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్‌తో ప్రజల రోజువారీ కార్యకలాపాల్లోను చాలా మార్పులు వచ్చాయి. ఎక్కువ సేపు నిద్రపోవటంతో పాటు ప్రజలు ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. వారి పనుల్లో ఆలస్యంగా చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఎక్కువ నిద్ర వచ్చినప్పటికీ వారు నిద్రపోవటం లేదు. ఎందుకంటే ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవటం కూడా మంచిది కాదని అంటున్నారు. 

లాక్ డౌన్ ఎక్కువ సేపు నిద్రపోవటం మంచిదా, కాదా అన్న విషయం పై స్విట్జర్లాండ్ లోని బాసెల్ విశ్వవిద్యాలయం కొంతమందిపై పరిశోధనలు జరిపింది. ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్ లో అత్యంత కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు ఉన్న సమయంలో 435 మందిపై మార్చి, ఏప్రిల్ నెలల మధ్య వారి నిద్రస్ధితి ఎలా ఉందనే దానిపై పరిశోధనలు జరిపారు. వారు ఇంటి నుంచి పని చేయటం వల్ల వారు రోజువారి నిద్ర షెడ్యూల్ కంటే ఎక్కువ సేపు నిద్రపోవటం, ఆలస్యంగా పనులను చేస్తున్నట్టు తేలింది. 

రచయిత క్రిస్టిన్ బ్లూమ్ మాట్లాడుతూ.. సాధారణంగా నిద్రసమయంలో కన్నా లాక్ డౌన్ సమయంలో ప్రజలు నిర్భంధంలో ఉండటం, సమాజాన్నికి దూరంగా ఉండటం, వారి రోజువారీ షెడ్యూల్ లో సడలింపులు వచ్చినట్టు తెలిపారు. దీంతో వారు రాత్రిపూట లేటుగా నిద్రపోతూ, ఎక్కువ సమయం నిద్రపోతున్నారని చెప్పారు.  కానీ మంచిగా, ప్రశాంతంగా, హాయిగా  నిద్రపోవాలంటే ఆరుబయట ఫిజికల్ యాక్టివ్స్ చేయాలని బ్లూమ్ సూచిస్తున్నారు.