Tea Bag Feat : భారీ ట్రక్కుతో టీ బ్యాగ్ ని గ్లాసులో డిప్ చేసిన డైవర్

ఓ భారీ ట్రక్కు డ్రైవర్ గ్లాసులో టీ బ్యాగ్ ను ట్రక్కుతో డిప్ చేసిన వీడియో వైరల్ గా మారింది. అతను ఈ ఫీట్ చేసిన విధానం చూస్తే ఏం టాలెంట్ రా బాబూ అనాల్సిందే.

Dutch Driver Dunk Tea Bag With His Truck

Tea bag feat with truck : ట్రైన్ లో టీ తాగాలంటే గ్లాసులో పాలు పోసి..ఓ టీ డిప్ ఇస్తారు. దాన్ని గ్రాసులో డిప్ చేసుకుని తాగుతాం.గ్లాసులో డిప్ చేయాలంటే టీ బ్యాగ్ ను కిందకూ పైకీ డిప్ చేసి తాగుతాం. కానీ ఓ ట్రక్కు డ్రైవర్ మాత్రం అందరిలా చేస్తే నా టాలెంట్ ఎలా తెలుస్తుంది?అనుకున్నాడేమో..ఏకంగా తన ట్రక్కుకు టీ బ్యాగ్ తగించి ట్రక్కుతో టీ బ్యాగ్ ను గ్లాసులో ముంచాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓరి నాయనో ‘నీది ఏం టాలెంట్ రా బాబూ’ అంటున్నారు.

నెదర్లాండ్స్ ఆమ్‌స్టర్‌డ్యామ్‌ కు చెందిన జోహాన్ గ్రోటెబోయర్ అనే ట్రక్కు డ్రైవర్ ఓ టీ గ్లాసును ఓ ట్రాఫిక్ కోన్‌పై పెట్టాడు. అది కూడా గాజు గ్లాసు. జాగ్రత్తగా ట్రాఫిక్ కోన్ పై ఉంచి టీ బ్యాగును ట్రక్కుకు తగిలించాడు. ట్రక్కును జాగ్రత్తగా నడుపుతూ టీ గ్లాస్ లో పర్ ఫెక్ట్ గా ముంచాడు. గ్లాస్ పక్కనుంచి వెనక్కి డ్రైవ్ చేశాడు. కరెక్టుగా టీ గ్లాస్ దగ్గరకు టీ బ్యాగ్ వచ్చేలా చేసి దాన్ని పర్ ఫెక్ట్ గా గ్లాస్‌లో మునిగేలా చేశాడు.ఇలా ఇంత పర్ ఫెక్ట్ గా చేయాలంటే ట్రక్ నడపటంలోనే కాదు సరైనా టైమింగ్…నేర్పరితనం ఉండాలి. ట్రక్ ఏమాత్రం సరిగా నడపకపోయినా టీ బ్యాగ్… గ్లాస్‌లోకి దిగదు. పైగా గ్లాస్ కింద పడి భళ్లున ముక్కలైపోతుంది. కానీ ట్రక్కు డ్రైవర్ మాత్రం కాలా పర్ఫెక్టుగా చేయటంతో ఆ వీడియో వైరల్ గా మారింది. అందుకే ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. వావ్ ఏమి టైమింగ్..ఏం టాలెంట్ అంటూ తెగ మెచ్చేసుకుంటున్నారు.

డచ్ ట్రక్ డ్రైవర్ జోహాన్ గ్రోటెబోయర్ చాలా ఈజీగా అత్యంత చాకచక్యంగా ఈ ఫీట్ చేశాడు. అంత పెద్ద భారీ ట్రక్కుని భలేగా నడిపి ఈ ఫీట్ చేశాడు. నిజానికి ఇదే ఫీట్‌ని ఇంతకుముందు ఫిన్‌లాండ్ డ్రైవర్ చేసి దానికి టీ బ్యాగ్ ఛాలెంజ్ అని పేరు పెట్టాడు. అది ప్రపంచంలోని పెద్ద ట్రక్కుల్లో ఒకటైన తన 82 అడుగుల చేసి చూపించాడు జోహాన్.ఫేస్‌బుక్‌లోని ఈ వీడియోకి 7 లక్షలకు పైగా వ్యూస్ రాగా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కానీ ఇదేమీ పెద్ద విషయం కాదనీ..ప్రపంచంలోని పెద్ద ట్రక్కుల్లో ఇదీ ఒకటి కావడం వల్లే వైరల్ అయ్యిందని అంటున్నాడు 30 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉన్న జోహాన్.