Suriya40: ‘ఎత్తారెక్కుమ్‌ తునిందవన్’ ఫస్ట్‌లుక్‌.. డిఫరెంట్ గెటప్ లో సూర్య!

కోలీవుడ్ స్టార్ హీరోలలో సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. సూర్య ఇటీవలే 'ఆకాశం నీహద్దు రా' పేరుతో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయగా తెలుగు ప్రేకకులను బాగానే ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత భారీ కమర్షియల్ హిట్ అందుకొని ఫాంలోకి వచ్చిన సూర్య ఇప్పుడు మరో సినిమాను సిద్ధం చేస్తున్నారు.

Suriya40

Suriya40: కోలీవుడ్ స్టార్ హీరోలలో సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. సూర్య ఇటీవలే ‘ఆకాశం నీహద్దు రా’ పేరుతో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయగా తెలుగు ప్రేకకులను బాగానే ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత భారీ కమర్షియల్ హిట్ అందుకొని ఫాంలోకి వచ్చిన సూర్య ఇప్పుడు మరో సినిమాను సిద్ధం చేస్తున్నారు. అదే ‘ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌’. ఈ సినిమా సూర్య కెరీర్‌లో 40గా రూపొందనుండగా పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

జులై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయగా అభిమానుల నుంచి భారీ రెస్పాండ్ అందుకుంటుంది. ఈ సినిమాలో సూర్య మరోసారి ఊరమాస్‌గా కనిపించనున్నట్లు ఫస్ట్‌లుక్‌ వీడియో ద్వారా అర్ధమవుతుంది. తెల్ల పంచె, చొక్కా వేసుకొని ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో తుపాకీతో ఓ షెడ్డులో విలన్లను వెంబడించి వేటాడుతూ సూర్య కనిపించగా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇమ్మాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

దీంతో ఈ ఫస్ట్ లుక్ విడుదలైన నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్ లో లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ‘గ్యాంగ్ లీడర్’, ‘శ్రీకారం’ సినిమాలతో పేరు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో సూర్యకి జంటగా నటిస్తోండగా కళానిధి మారన్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు.