సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ న్యూస్ ఫీడ్‌లో కొత్త లేబులింగ్ పోస్టులు, పేజీలను ప్రారంభించినుంది. రాష్ట్ర నియంత్రణలో ఉన్న ఎడిటోరియల్ పాక్షిక మీడియా ఔట్ లెట్స్ ద్వారా ఈ రెండు ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. Ad Library Page View, On Pages, Page Transparency Sectionలో ఈ లేబుల్స్ కనిపించ నున్నాయి.
అలాగే, ప్రభుత్వ ప్రభావిత మీడియా ఔట్ లెట్ల నుంచి వచ్చే యాడ్స్ కూడా బ్లాక్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలోని ఫేస్‌బుక్ యూజర్లు తమ ఫేస్‌బుక్ అకౌంట్లోని న్యూస్ ఫీడ్‌లో వచ్చేవారం నుంచి కొత్త లేబులింగ్ పోస్టులు, పేజీలను చూడొచ్చు. ‘కొన్ని నెలల క్రితమే.. ప్రభుత్వ అధీనంలోని ఎడిటోరియల్ కింద పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో లేబుల్ మీడియా ఔట్ లెట్ల కోసం ప్లాన్ ప్రకటించింది.
‘రాష్ట్ర నియంత్రిత మీడియా ఔట్ లెట్ల ద్వారా లేబుల్స్ శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నాం. ఇందులోని పబ్లీషర్ల కోసం గొప్ప పారదర్శకతను అందిస్తున్నాం. ఎందుకంటే.. మీడియా సంస్థలన్ని కలిసి సంయుక్తంగా వార్తలు అందించే వ్యూహాత్మక విధానం. పబ్లిషర్లు నుంచి వచ్చే పెయిడ్ కంటెంట్‌లో సమాన పారదర్శకత ఉండేలా చూస్తాం. వచ్చే ఏడాదిలో ఈ పబ్లిషర్ల నుంచి లేబులింగ్ యాడ్స్ ప్రారంభిస్తాం’ అని Head of cyber security Policy అధినేత Nathaniel Gleicher తన బ్లాగ్ పోస్టులో తెలిపారు.
ప్రభుత్వం నియంత్రించే పోస్టులను లేబుల్ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే.. మీడియా సంస్థలను ఎవరు నడుపుతున్నారో వినియోగదారులకు తెలియజేయడం అని సోషల్ మీడియా దిగ్గజం పేర్కొంది. అమెరికాలోని 2020 నవంబర్ ఎన్నికలకు ముందు బహిరంగ చర్చలో వివిధ రకాల విదేశీ ప్రభావాలకు వ్యతిరేకంగా అదనపు రక్షణ కల్పించనున్నట్టు తెలిపింది. అమెరికాలోని రాష్ట్ర-నియంత్రిత మీడియా సంస్థల నుంచి ప్రకటనలను నిరోధించడాన్ని ప్రారంభిస్తామని ఫేస్ బుక్ తెలిపింది.
లేబుల్ పేజీలకు సంబంధించి సోషల్ దిగ్గజం 65 మందికి పైగా నిపుణులతో సంప్రదించి సలహాలు సూచనలు తీసుకుంది. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ లేటెస్టు పోస్టుతో ఫేస్ బుక్ వార్తల్లో నిలిచింది. సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ తన సొంత ఉద్యోగుల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ట్రంప్ వ్యవహారాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని సీఈఓను ఏకిపారేశారు.