లాక్‌డౌన్‌తో ‘గగన్‌యాన్’ మొదటి ట్రయల్ ఆలస్యం కావొచ్చు : ఇస్రో

  • Publish Date - June 11, 2020 / 11:56 AM IST

ఇండియా మొట్టమొదటి ప్రతిష్టాత్మక అంతరిక్ష విమాన ప్రాజెక్ట్ ‘గగన్ యాన్’ ఆలస్యం కానుంది. కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా గగన్ యాన్ ప్రాజెక్టుపై ఎఫెక్ట్ పడింది. ఫలితంగా కొంత ప్రతికూల ప్రభావం చూపినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు. బెంగళూరు ప్రధాన కార్యాలయం ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) గగన్ యాన్ కంటే ముందు సిబ్బంది లేకుండా రెండు ట్రయల్ ఫ్లైట్లను ప్లాన్ చేసినట్లు తెలిపింది. మొదటిది 2020 డిసెంబర్ నెలలో ప్రారంభం కానుండగా.. రెండవది జూలై 2021లో ప్రారంభం కానుంది.

కొవిడ్-19 కారణంగా కొన్ని అవాంతరాలు ఎదురైనట్టు ఇస్రో తెలిపింది. కానీ గగన్ యాన్ ప్రాజెక్టు ఆలస్యంపై ఇప్పటికీ ఏమీ ఇస్రో ధృవీకరించలేదు. ఇంకా ఆరు నెలల సమయం ఉందని, షెడ్యూల్ నాటికి అక్కడికి చేరుకోగలమా లేదా అని ప్రయత్నిస్తున్నామని ఇస్రో సీనియర్ అధికారి చెప్పారు. గగన్ యాన్ కాస్తా ఆలస్యమైనప్పటికీ షెడ్యూల్ లో కొంచెం మార్పులు ఉండవచ్చు. కానీ మేము పూర్తిగా పర్యవేక్షించినప్పుడు మాత్రమే అది ఏమైంది అనేది తెలుస్తుందని అన్నారు. 

ఎందుకంటే ప్రాజెక్టులో పని చేస్తున్న బృందం ఆలస్యం  ఎప్పటివరకూ అవుతుందో కచ్చితమైన తేదీని సూచించలేదని తెలిపారు. మొదటి టెస్ట్ ఫ్లైట్‌లో హ్యూమనాయిడ్  ‘Vyommitra’ ను తీసుకెళ్లాలని ఇస్రో యోచిస్తోంది. భారత స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవం సందర్భంగా 2022వ సంవత్సరంలో రూ .10,000 కోట్ల ‘గగన్ యాన్’ ప్రాజెక్టును అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రారంభించనుంది. నలుగురు భారత వైమానిక దళ ఫైటర్ పైలట్లు గగన్యాన్ ప్రాజెక్ట్‌లో పాల్గొననున్నారు. వీరంతా ప్రస్తుతం మాస్కోలో ట్రైనింగ్ లో ఉన్నట్టు ఇస్రో అధికారి ఒకరు తెలిపారు. 

Read: బిస్కెట్ అనుకుని బాంబు కొరికిన 6 ఏళ్ల బాలుడు మృతి