Congress would have defeated BJP in Gujarat if AAP says Rahul Gandhi
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సాకులు చెబుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. పలు దేశాల్లో కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ లో తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా భారత్ జోడో యాత్రను ఆపేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి మాండవీయ లేఖ రాసిన విషయం తెలిసిందే. హరియాణాలోని ఘసెరా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఇవాళ రాహుల్ గాంధీ దీనిపై మాట్లాడారు.
‘‘కశ్మీర్ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ సారి బీజేపీ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. నాకు వారు ఓ లేఖ రాశారు. కరోనా వ్యాప్తి చెందుతోందని, యాత్రను ఆపాలని అన్నారు. పాదయాత్రను నిలిపేందుకు వారు సాకులు చెబుతున్నారు. మాస్కులు ధరించాలని, కరోనా వ్యాప్తి చెందుతోందని అంటున్నారు. ఇవన్నీ వారు చెబుతున్న సాకులే. సత్యాన్ని చూసి బీజేపీ భయపడుతోంది’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ప్రధాని మోదీల వల్ల విద్వేషం నిండుతోందని, ఇటువంటి భారత్ ను తాము కోరుకోవడం లేదని ఆయన అన్నారు. కాగా, భారత్ జోడో యాత్ర ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ పాదయాత్ర తమిళనాడు, కేరళ, ఏపీ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ముగిసింది. తమ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి భయపడి ఆ యాత్రను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Bharat Jodo Yatra: అందుకే భారత్ జోడో యాత్రను ఆపాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది: కాంగ్రెస్