తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు, అల్ప పీడనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తెలంగాణలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. గోవా రాష్ట్రాలతో పాటు కొంకణ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్ర, మరఠ్వాడా, కోస్తాంధ్రా, యానాం, ఉత్తర కర్ణాటక, విదర్భ, అసోం, మేఘాలయాల్లో కూడా వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో మహారాష్ట్రలో ముంబై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. జూన్ 15 నాటికి మహారాష్ట్ర అంతటా రుతుపవనాలు విస్తరించనున్నాయి. అలాగే ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో, ఛత్తీస్‌గఢ్, దక్షిణ గుజరాత్, దక్షిణ మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతపవనాలు మహారాష్ట్రలోకి ప్రవేశించాయి. దీంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.