Vitamin B3 (1)
Vitamin B3 : మనం రోజువారిగా తీసుకునే ఆహారంలో విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులతోపాటు, వైద్యులు సూచిస్తుంటారు. వీటి వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఇంట్లోని గృహిణులు వివిధ రకాల పోషకాహారాలను మనకు రోజువారిగా తయారుచేసి అందిస్తుంటారు. మనం తీసుకునే ఆహారాల ద్వారా లభించే ఒక్కో విటమిన్ మన ఆరోగ్యానికి ఒక్కో విధంగా సహాయపడుతుంది. అయితే మీరు తీసుకునే ఆహారంలో ఉండవలసిన విటమిన్లలో ముఖ్యమైనది విటమిన్ బి3. అనేక ఆరోగ్యప్రయోజనాలు ఈ విటమిన్ వల్ల మనకు చేకూరతాయి.
రీసెర్చ్ గేట్ లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం నియాసిన్ అనేది తీసుకున్న ఆహారాన్ని శరీరానికి శక్తిగా మార్చటానికి సహాయపడుతుంది. ఇది నాడీ వ్యవస్ధ, జీర్ణ వ్యవస్ధ ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది. చర్మ కణజాలలను రక్షించటంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్ధాయిలను మెరుగుపర్చటంతోపాటు, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. విటమిన్ బి 3 లభించే రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1. చికెన్ బ్రెస్ట్ లో ప్రత్యేకించి బి 3 నియాసిన్ తోపాటు లీన్ ప్రొటీన్ లభిస్తుంది. వండిన 85 గ్రాముల చికెన్ బ్రెస్ట్ మాంసంలో 11.4 మి.గ్రా ల నియాసిన్ ఉంటుంది. పోషకాహార నిపుణులు దీనిని తీసుకోవటం ఉత్తమని సూచిస్తున్నారు.
2. చేపల జాతిలో ఒకటైన ట్యూనా ఫిష్ లో బి3 అధికంగా లభిస్తుంది. ఆహార ప్రియులకు ఈ తరహా సముద్ర చేపను ఇష్టంగా తీసుకోవచ్చు. ఈ చేపలను ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ప్రొటీన్ తోపాటు, విటమిన్ బి6, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సైతం పుష్కలంగా లభిస్తాయి.
3. శాకాహారులకు వేరుశెనగలు బాగా ఉపకరిస్తాయి. ఇందులో విటమిన్ బి3 నియాసిన్ అధికంగా లభిస్తుంది. వేరుశెనగలో ప్రోటీన్, మోనోశాచురేటెడ్ కొవ్వులు, విటమిన్ ఇ, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి.
4. పుట్టగొడుగులు విటమిన్ బి 3 నియాసిన్ లభించే కూరగాయల వనరులలో ఒకటిగా చెప్పవచ్చు. పోషకాహార పట్టిక ప్రకారం రోజుకు 70 గ్రాముల పుట్టగొడుగులు తీసుకోవచ్చు. శాఖాహారులకు ఈ శిలీంధ్రాలు విటమిన్ బి 3 లభించే మంచి ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు.
5. పచ్చిబఠానీల్లో సైతం విటమిన్ బి3 అధికంగా లభిస్తుంది. బఠానీలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మెళనాలు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడతాయి. అంతేకాకుండా మంచి గట్ బ్యాక్టీరియా పెరుగదలను ప్రోత్సహిస్తాయి.