మిడతలను తరమడానికి చిన్నారుల ప్రయత్నాలు

  • Publish Date - May 29, 2020 / 09:09 AM IST

కరోనా వైరస్ ముప్పు ఇంకా పోనే పోలేదు. అప్పుడే మరో అపద్రవం వచ్చేసింది. దేశ వ్యాప్తంగా మిడతల దండు భయకంపితులను చేస్తోంది. ప్రధానంగా రైతులు భయం భయంగా గడుపుతున్నారు. కష్టపడి..చెమటోడ్చిన పంటలను కాపాడుకోవాడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఆఫ్రికా నుంచి గల్ప్ దేశాలు, పాక్ మీదుగా భారత భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. కోట్లు పైగా ఉన్న ఈ దండు పంటల మీదకు దూసుకొస్తున్నాయి.

రాజస్థాన్, పంజాబ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించిన ఈ మిడతలు పంటలను పాడు చేస్తున్నాయి. మిడతల నుంచి పంటలను కాపాడుకోవడానికి వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పొలాల్లో క్రిమి సంహాకరక మందులను స్ర్పే చేస్తుండగా…బాణాసంచా కాలుస్తున్నారు. 

తాజాగా యూపీ రాష్ట్రంలోని కాన్పూర్ లో ఓ ప్రాతంలో కొంతమంది చిన్నారులు మిడతలను ప్రారదోలేందుకు తమ సహాయాన్ని అందించారు. కూరగాయ తోటల్లో వాలిన మిడతలను ప్రారదోలేందుకు స్టీల్ గిన్నెలు, కంచాలు తీసుకని డప్పు మాదిరిగా వాయించేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. చిన్నారుల ప్రయత్నాలను పలువురు అభినందిస్తున్నారు. 
 

Read: భారత్ లో మిడతల దండు జ్ఞాపకాలు.. కరోనాతో పాటు..మరో తలనొప్పి