కేరళ సీఎం కుమార్తె పెళ్లి..పెళ్లి కొడుకు ఎవరో తెలుసా

  • Publish Date - June 10, 2020 / 07:30 AM IST

కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణ పెళ్లి కూతురు కాబోతోంది. CPIM యువజన విభాగం DYFI జాతీయ అధ్యక్షుడు, వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న మహ్మద్ రియాజ్ ను వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. వీణకు ఒక్కరు, రియాజ్ కు ఇద్దరు పిల్లలున్నారు. జూన్ 15వ తేదీన వీరిద్దరి వివాహం జరుగనుందని తెలుస్తోంది. లాక్ డౌన్ నిబంధనల కారణంగా తక్కువ మంది బంధువుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి జరుగనుంది. 

సీఎం పినరయి ఎంత సింపుల్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. పినరయి విజయన్, కమల విజయన్ దంపతుల పెద్ద కుమార్తె వీణ బెంగళూరులో సొంతంగా స్టారప్ సంస్థ ఎక్సోలాజిక్ సెల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. DYFI జాతీయ విభాగం అధ్యక్షుడు ఉన్న రియాజ్..CPIM కమిటీలో కూడా ఉన్నారు.

కేరళలోని కోజికోడ్ కు చెందిన రియాజ్..మళయాలంలో విద్యాభ్యాసం చేశారు. విద్యాభ్యాసం చేసే సమయంలోనే..రియాజ్ DYFI నాయకుడిగా ఉన్నారు. 2017లో DYFI జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో కోజికోడ్ నుంచి పోటీ చేసిన..ఇతను యూడీఎఫ్ నేత రాఘవన్ చేతిలో 800 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. 

Read: అయోధ్య రామమందిరం నిర్మాణానికి భూమిపూజ, వేద మంత్రోచ్చరణల మధ్య రామాలయానికి పునాదులు