Allu Arjun: అల్లు అర్జున్‌కి థాంక్స్ చెప్పిన కేరళ జిల్లా కలెక్టర్.. ఎందుకు?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళ స్టేట్ జిల్లా కలెక్టర్ సోషల్ మీడియా వేదికగా థాంక్యూ చెప్పాడు. అల్లు అర్జున్ 'డీజే' సినిమాలో.. "మనం చేసే పనిలో మంచి కనిపిస్తే చాలు, మనిషి కనపడాల్సిన అవసరం లేదు" అనే డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటది. నిజ జీవితంలో కూడా బన్నీ అదే డైలాగ్ ని ఫాలో అవుతూ అందరికి ఇన్స్పిరేషన్ అవుతున్నాడు.

Kerala District Collector thanked Allu Arjun

Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళ స్టేట్ జిల్లా కలెక్టర్ సోషల్ మీడియా వేదికగా థాంక్యూ చెప్పాడు. అల్లు అర్జున్ ‘డీజే’ సినిమాలో.. “మనం చేసే పనిలో మంచి కనిపిస్తే చాలు, మనిషి కనపడాల్సిన అవసరం లేదు” అనే డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటది. నిజ జీవితంలో కూడా బన్నీ అదే డైలాగ్ ని ఫాలో అవుతూ అందరికి ఇన్స్పిరేషన్ అవుతున్నాడు.

Allu Arjun : ఏడ్చేసిన అల్లు అర్జున్

కేరళ లోని అలప్పుజాకు చెందిన ఒక ఇంటర్ చదివే యువతి, 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినా తండ్రి చనిపోవడంతో ఆర్ధికసాయం లేక చదవలేకపోతున్నానంటూ అలెప్పి కలెక్టర్ వీఆర్ కృష్ణ తేజకు తెలియజేసింది. ఇక అధికారులు ‘VR for Alley’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆ యువతికి అవసరమైన సహాయం అందేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి ఒక స్పాన్సర్ కావాల్సి వచ్చింది.

దీంతో అధికారులు అల్లు అర్జున్ ని సంప్రదించి ఒక సంవత్సరానికి గాను స్పాన్సర్‌షిప్ ని కోరగా.. బన్నీ ఏకంగా ఆ యువతి కంప్లీట్ స్టడీస్ ఖర్చుతో పాటు హాస్టల్ ఖర్చులు కూడా భరిస్తాను అని మాట ఇచ్చాడట. అయితే ఈ విషయాన్ని కేరళ కలెక్టర్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కి కృతజ్ఞతలు తెలియజేయడంతో బయటికి వచ్చింది. ఈ సంగతి తెలిసిన అభిమానులు అల్లు అర్జున్ ని అభినందిస్తున్నారు.