Liger Gets Objection Form Censor Board: లైగర్‌కు షాకిచ్చిన సెన్సార్ బోర్డు.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.

Liger Gets Objection Form Censor Board: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ ఓ బాక్సర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Liger Pre Release Event : ఈ సారి గుంటూరులో అదరగొట్టనున్న విజయ్ దేవరకొండ.. లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్, ప్లేస్ ఫిక్స్..

ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు లైగర్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేయగా, ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు లైగర్ టీమ్‌కు షాకిచ్చారట. ఈ సినిమాలో కొన్ని అభ్యంతకరమైన సీన్స్ ఉన్నాయని.. వాటిని పూర్తిగా తొలిగించాల్సిందిగా సెన్సార్ బోర్డు ఆదేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ మూవీ అంటేనే బోల్డ్ డైలాగులు ఎక్కువగా ఉంటాయి. ఇక పూరీ లాంటి ఊరమాస్ డైరెక్టర్ తోడవ్వడంతో, లైగర్ సినిమాలో ఎఫ్-వర్డ్ సీన్స్ బాగానే ఉన్నాయట. దీంతో వాటిని తొలిగించాల్సిందే అంటూ సెన్సార్ బోర్డు తెలిపింది.

Liger fandom tour : వరంగల్ లో లైగర్ ఫ్యాన్ డం టూర్ సెలబ్రేషన్స్

లైగర్ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు సీన్స్‌ను తీసేయాల్సిందిగా సెన్సార్ బోర్డ ఆబ్జెక్ట్ చేసిందట. ఇక సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు ఆయా సీన్స్‌ను తొలగించి లైగర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. మరి లైగర్ సినిమాలో ఇంకా అలాంటి బోల్డ్ సీన్స్ ఏముంటాయా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో.. ముఖ్యంగా రౌడీ ఫ్యాన్స్‌లో నెలకొంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా, రమ్యకృష్ణ, మైక్ టైసన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు