కొవిడ్-19 లాక్‌డౌన్‌లో లోదుస్తుల ‘బ్రా’లకు పెరిగిన క్రేజ్.. ఎగబడి కొనేశారంట!

  • Publish Date - June 6, 2020 / 02:39 PM IST

మహిళల కోసం కంఫర్ట్ డ్రెస్సింగ్ తప్పనిసరిగా ఉండాలి. లోదుస్తుల విషయంలోనూ అదే కోరుకుంటారు. మహిళలు నిజంగా కోరుకునేది దీర్ఘకాలిక సౌకర్యం. లాక్ డౌన్ సమయంలో బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. షాపింగ్ కు చేసి అవసరమైనవి కొనే వీలు లేదు. కొవిడ్-19 యుగంలో లాక్ డౌన్ దెబ్బతో చాలావరకు ష్యాషన్ రంగం దెబ్బతిన్నది. కానీ, లాక్ డౌన్ దశలవారీగా పాక్షికంగా ఎత్తివేయడంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు భారీగా పెరిగిపోయాయి. అందులోనూ లింగరే కేటగిరీ బ్రాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. బ్రాలు కొనేందుకు ఆన్ లైన్‌లో ఆర్డర్ల హడావిడి మొదలైంది. పుష్-అప్‌లు, బాల్కనెట్‌లు, స్లింకీ లాసీ వంటి మరిన్ని రకాల బ్రాలకు కూడా వ్యాపారం పెరిగిపోయింది.  

ప్రీ-లాక్‌డౌన్‌తో పోలిస్తే Lingerie  కేటగిరికీ చెందిన లోదుస్తులకు భారీ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వాల్యూమ్‌లతో మూడు రెట్లు ఎక్కువ పెరిగాయని Myntra బిజినెస్ హెడ్ అయ్యప్పన్ రాజగోపాల్ చెప్పారు. లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేయబడటంతో, రిటైల్ థెరపీ బలంగా పుంజుకున్నట్టు కనిపిస్తోందని అన్నారు. అయితే ఇందులోలోదుస్తులు (Lingerie) బెస్ట్ సెల్లర్ కేటగిరీగా నిలిచింది. లోదుస్తుల కంటే పై దుస్తుల సేల్స్ భారీగా తగ్గినట్టు కనిపించిందని అమాంటె లోదుస్తుల కంపెనీ మాస్ బ్రాండ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ వివేక్ మెహతా చెప్పారు.

అయితే వచ్చే రెండు నెలల్లో ఈ పెరుగుదల మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్టు మెహతా తెలిపారు. ఆన్‌లైన్ షాపింగ్ బండ్లు స్లీప్‌వేర్, ముఖ్యంగా టి-షర్ట్  పైజామా (లేదా షర్టులు), బ్రాలు బేసిక్ నిక్కర్ ప్యాక్‌ల వంటి జంట సెట్ ప్యాక్‌లతో ఉంటాయని బ్రాండ్లు చెబుతున్నాయి. మహిళలు నిజంగా కోరుకునేది దీర్ఘకాలిక సౌకర్యమే. కోవిడ్ -19 యుగంలో షాపింగ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని చెప్పాలి. 

లాక్ డౌన్‌‌కు ముందు లోదుస్తుల షాపింగ్ ఫిట్ స్టయిల్స్ కోసం ప్రయత్నించిన తర్వాత కొనుగోళ్లు చేస్తుండేవారు. కొవిడ్ యుగంలో పరిస్థితులన్నీ తలకిందలయ్యాయి. ట్రయల్ రూములు ఇప్పుడు లేవు.. లోదుస్తుల షాపింగ్ ఆన్‌లైన్‌లోకి మారాయి. అయితే లాక్‌డౌన్ 4.0 తర్వాత షాపులను తెరిచేందుకు అనుమతించారు. టచ్ పాయింట్లు, కాంటాక్ట్‌లెస్ డెలివరీ, ప్రొటెక్టివ్ గేర్ ధరించిన ఆన్-ఫీల్డ్ ఏజెంట్లు కొనుగోలు చేయడానికి కారణాలుగా చెప్పవచ్చు.

ఇవన్నీ కస్టమర్ విశ్వాసాన్ని పెంచడానికి సహాయపడతాయని అంటున్నారు విశ్లేషకులు. ఆన్‌లైన్ డిమాండ్ పెరుగుదల వినియోగదారుల భద్రతకు నిదర్శనంగా చెప్పవచ్చు. లోదుస్తుల విభాగం దీనికి మినహాయింపు కాదని రాజగోపాల్ వివరించారు. మల్టీ బ్రాండ్ ఔట్ లెట్లు (MBOs)లో దాదాపు ట్రయల్ రూమ్స్ ఇప్పటివరకూ పరిమితంగానే ఉన్నాయి. 

ప్రీమియం బ్రాండ్లలో Marks & Spencer తాత్కాలికంగా ఫిట్టింగ్ సర్వీసులు, ట్రయల్ రూంల నుంచి తొలగించారు. ఇప్పుడు వీటిపై 90 రోజుల పూర్తి ధరతో రిఫండ్ లేదా ఎక్సేంఛ్ గడువును పొడిగించారు. ఆన్ లైన్లో లో-దుస్తులను కొనుగోలు చేసి ఇంట్లోనే ధరించి ఫిట్ కాని పక్షంలో తమ వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ రిటర్న్ చేసుకునే అవకాశం కల్పించింది. Amanté కంపెనీ మాత్రం.. ట్రయల్స్ చేసేందుకు అనుమతినిస్తోంది. అది కూడా తమ ట్రయల్ రూంల్లో రెగ్యులర్ శానిటైజేషన్ తో మాత్రమే సౌకర్యం కల్పిస్తోంది.

merchandise మెటేరియల్స్ కూడా ముందుగా శానిటైజ్ చేసిన తర్వాతే ప్రీ- పోస్ట్ ట్రయల్స్ చేస్తున్నట్టు Mehta చెప్పుకొచ్చారు. అన్ని ప్రొడక్టులను కస్టమర్లతో ప్రయత్నించిన తర్వాత ఆయా లో దుస్తులను 48 గంటల పాటు ప్రత్యేక బాక్సులో పెడతారు. ఆ తర్వాత ఆ దుస్తులను తిరిగి తీసుకొచ్చి డిస్ ప్లే పోస్టులో పెట్టి శానిటైజ్ చేస్తారు. ఆఫ్ లైన్ కొనుగోలులో ట్రయల్స్ అంతర్గత భాగమని విశ్వసిస్తున్నారు. కస్టమర్లకు ప్రొడక్టు విషయంలో సౌకర్యంగా ఫీల్ అయ్యేలా చూడటమే తమ ఉద్దేశమని చెబుతోంది.